Site icon HashtagU Telugu

Viral Video: వీడు మాములోడు కాదు, తల్లిపైనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు!

Viral

Viral

పిల్లలే (Childrens) కదా అని.. చాలామంది తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఒక్కసారి వాళ్లను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే ఏ పనైనా చేయడానికి వెనుకాడరు. కొట్టినా.. తిట్టినా వెంటనే రియాక్ట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ పదేళ్ల బడుతడు తన తల్లిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది. అందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్(AP) లోని ఏలూరులో ఈ ఘటన జరిగింది.

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే తల్లి ఇవ్వలేదు. దీంతో కోపం తెచ్చుకున్న పిల్లాడికి ఏం చేయాలో అర్దం కాలేదు.  తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఈ పదేళ్ల బుడతడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. స్నానం చేసి కట్టుకున్న టవల్తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లడంతో పోలీసులకు షాక్ అయ్యారు. తన తల్లి అడిగిన అంగీ ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. బాలుడి మాటలను విన్న పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఏలూరు కొత్తపేటలో ఉండే సాయిదినేష్ కు పదేళ్లు. రెండేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. మారు తల్లి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: Garuda Buses: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రయ్ రయ్!

Exit mobile version