Site icon HashtagU Telugu

Video Viral: ఎండ వేడి తట్టుకోలేక నీటి తొట్టిలో జలకాలాడుతున్న పాము.. వీడియో వైరల్?

Video Viral

Video Viral

వేసవికాలం మొదలవడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటికి రావాలి అంటేనే అల్లాడి పోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత బయటకు వెళ్లాలి అంటే ఎండ. దానికి తోడు కరెంటు కూడా సరిగా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్ లు , కూలర్లు, ఏసీలు వేసుకుంటే అంతంత మాత్రం శాంతంగా ఉంటుంది.

మనుషుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పక్షులు,జంతువులు, సరిసృపాల బాధ వర్ణనాతీతం. మూగజీవులు అయ్యిందా వేడిమి తట్టుకోలేక చాలా జీవులు వడదెబ్బ కారణంగా మరణిస్తున్నాయి. మనుషులు కూడా చాలామంది వడదెబ్బ కారణంగా మరణిస్తున్నారు. దానికి తోడు అడవుల్లో చిన్న చిన్న గుంటల్లో నీరు ఎండిపోవడంతో కనీసం పక్షులు జంతువులు గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు ఉండడం లేదు. దాంతో పక్షులు మూగ జంతువులు కింద వేడి తట్టుకోలేక మనసులు నివసించే ప్రాంతాలకు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఒక నాగు పాము విలవిల్లాడిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఒక ఇంటి వద్ద ఉన్న నీటి తొట్టెలోకి నాగుపాము వచ్చి సేద తీరింది. నీటి కోసం తొట్టి వద్దకు వెళ్లిన ఆ ఇంట్లోని వారు దాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసి బయట వదిలిపెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎండాకాలంలో వేడి తట్టుకోలేక పాములు, ఇతర అటవీ జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి.

Exit mobile version