సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర (Egg Cost) రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. కానీ ఈ కోడి గుడ్డు ధర మాత్రం వందల్లో ఉంటుంది. ఎందుకా అంత అనుకుంటున్నారా..? ఇది మాములు కోడి గుడ్డు కాదు..పందెం కోడి గుడ్డు. అందుకే దాని ధర ఆ రేంజ్ పలుకుతుంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ప్రత్యేక పెట్టెల సాయంతో వీటిని పొదిగిస్తారు. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో ఈ పందెం కోడ్ల గుడ్లు ఆర్థిక వనరుగా మారాయి. చాలా మంది రైతులు ఈ గుడ్ల వ్యాపారాన్ని కుటీర పరిశ్రమగా మార్చుకొని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇవి స్థానిక మార్కెట్లతో పాటు, ఇతర ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది.
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు భారీ షాక్!
ప్రస్తుతం ఏపీలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) మొదలయ్యాయి. సంక్రాంతి వచ్చిదంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. ఈ సారి పండుగకు ముందే పోటీలు జోరందుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. గుట్టుగా సంక్రాంతికి ముందే పందేలు నిర్వహిస్తున్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రెండు నెలలుగా ఒక్కో వారం ఒక్కో మండలంలో పందేలు వేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారు మాత్రమే బరిలోకి వచ్చేలా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీయకుండా ముందుగానే ఫోన్లు తీసుకుంటున్నారు. తాజాగా ఉండి మండలం సీసలిలో భారీ ఎత్తున పందేలు వేశారు. ఒక్కో పందేనికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున రూ.50 లక్షలకు పైగా చేతులు మారాయని తెలుస్తోంది. ఇటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున కోళ్లు గోదావరి జిల్లాల్లో కూత పెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు చిన్నా పెద్ద అన్ని పందేల్లో కలిపి దాదాపు రూ.100 కోట్లు చేతులు మారాయని వినికిడి.
ఇక సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కడున్నా, ఇతర దేశాల్లో ఉన్నా సంక్రాంతి పండుక్కి తప్పకుండా స్వగ్రామాలకు వచ్చి తీరుతారు. అంతే కాదు పండుగ పేరుతో నిర్వహించే కోడిపందేలు తిలకించేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే సంక్రాంతి రోజుల్లో పందెం కోళ్లకు ఎక్కడా లేని గిరాకీ ఉంటుంది. పందేలపై నిషేధం ఉన్నా కూడా చాలా ప్రాంతాల్లో కోడి పందేలను గుట్టుగా నిర్వహిస్తుంటారు.