Mystery : ఆ తెగ ప్రజల కాళ్లకు రెండే వేళ్లు..ఎందుకో తెలుసా..?

సాధారణంగా మనిషి కాళ్లకు 5 వేళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలకు మాత్రం 5 వేళ్లు కాదు కేవలం 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 11:26 AM IST

ఈ ప్రపంచ ఎంతో పెద్దది..ఎన్నో రకాల జీవులు , ఎన్నో వింతలు..ఎన్నో తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రతి రోజు ప్రపంచంలో జరిగే విశేషాలు , సంఘటనలు , అద్భుతాలు , వింతలు ఇలా ఎన్నో తెలుసుకుంటుంటున్నాం. అయితే ఇక్కడ ఓ వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనిషి కాళ్లకు 5 వేళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ డొమా తెగ గా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా (Vadoma Tribe) లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. ఈ తెగ కు చెందిన మనుషులకు మాత్రం 5 వేళ్లు కాదు కేవలం 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి.

మరి వారి లోపం వల్ల ఆలా వస్తున్నాయో..ఏదైనా వింతో అర్ధం కాదు కానీ ఆ తెగ ప్రజలను ఎవర్ని చూసిన ఇలాగే రెండు పాదాలతో కనిపిస్తుంటారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్‌( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉండడం తో అంత వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని (Zimbabwe) కన్యెంబా (Kayemba ) ప్రాంతంలో నివశిస్తుంది.

Read Also : Aadhaar: మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదికపై కేంద్రం ఫైర్.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్..!

ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ లేదా ఉష్ట్రపక్షి పాదాల సిండ్రోమ్‌ (ostrich foot syndrome) అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి.

ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు.. చెప్పులు వేసుకోలేరు..కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. మిగతా ఏ పనులు కూడా సరిగా చేసుకోలేరు. వీరి బాధను చాలామంది ప్రభుత్వాలు వీరిని ఆదుకోవాలని కోరుతున్నాయి.