Site icon HashtagU Telugu

Wedding Cake: వజ్రాలు, ముత్యాలతో 120కిలోల వెడ్డింగ్ కేక్.. ధరెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

arab bride most expensive cake

arab bride most expensive cake

Wedding Cake: పుట్టినరోజు, న్యూ ఇయర్ వరకే ఉండే కేక్ కటింగ్ కల్చర్.. ఆ తర్వాత పెళ్లి, పెళ్లిరోజు, స్పెషల్ డేస్ ల వరకూ పెరిగింది. ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కి, పెళ్లికి, రిసెప్షన్లకు కూడా కేక్ లను కట్ చేయడం ఫ్యాషన్ గా మారింది. ఎంత గ్రాండ్ గా పెళ్లిచేసుకున్నా.. వధూవరులు కట్ చేసే కేక్ విలువ మహా అయితే వేల రూపాయల్లో ఉంటుంది. ఇంకొంచెం గ్రాండ్ గా అయితే.. ఒక లక్ష వరకూ ఉండొచ్చు.

కానీ.. ఈ కేక్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్ గా నిలిచింది. ఈ వివరాలు నెట్టింట వైరల్ అవుతుండగా.. కేక్ ధర తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకీ ఆ కేక్ ధర ఏ మాత్రం ఉంటుందనుకుంటున్నారు ? అక్షరాలా రూ.8 కోట్లు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

చూడటానికి పెళ్లికూతురిలో కనిపిస్తున్న ఈ కేక్ ను రూపొందించేందుకు దుబాయ్ కి చెందిన డెబ్బీ వింగ్ హామ్ చాలా కష్టపడింది. అరబ్ వధువు ఆకారంలో.. 180 సెంటీమీటర్ల ఎత్తు, 120 కిలోల బరువుతో రూపొందించిన ఈ కేక్ ను తయారు చేసేందుకు 10 రోజుల సమయం పట్టిందట. కేక్ తయారీకి 1000 కోడిగుడ్లు, 20 కిలోల చాక్లెట్ తో పాటు.. 50 కిలోల లాసీ మిఠాయిని ఉపయోగించారు.

మనుషులు తినే 3 క్యారెట్ వజ్రాలు, ముత్యాలను కూడా కేక్ తయారీకి వాడారు. 50 కిలోల కేక్ ఫాండెంట్, 5 వేల హ్యాండ్ మేడ్ ఫాండెంట్ పువ్వులతో ఘీ వెడ్డింగ్ గౌన్ ను, రైస్ క్రిస్పీ, మోడలింగ్ చాక్లెట్ తో కేక్ ను తయారు చేశారు. 5 వేలకు పైగా పువ్వులు, 10 వేల ముత్యాలు, 110 పౌండ్స్ తో కేక్ ఫౌండేషన్ ను రూపొందించారు. అందుకే ఈ కేక్ ధర కోట్ల రూపాయల్లో ఉంది. 8 కోట్ల రూపాయల విలువైన ఈ కేక్ ను ప్రస్తుతం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచారు.