Viral: డబ్బు ఎక్కువైన బలుపు.. బెంజ్ కారులో వచ్చి డబ్బును నేలకేసి కొట్టిన వ్యక్తి!

డబ్బు మనషిలో అహాన్ని, బలుపును బయటకు తెస్తుందనడంటో ఎలాంటి సందేహం లేదు. మనిషి దగ్గర డబ్బు వస్తున్న కొద్దీ అతడి ప్రవర్తనలో మార్పు రావడం మనం చూస్తేనే ఉంటాం.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 02 06 At 22.31.11

Whatsapp Image 2023 02 06 At 22.31.11

Viral: డబ్బు మనషిలో అహాన్ని, బలుపును బయటకు తెస్తుందనడంటో ఎలాంటి సందేహం లేదు. మనిషి దగ్గర డబ్బు వస్తున్న కొద్దీ అతడి ప్రవర్తనలో మార్పు రావడం మనం చూస్తేనే ఉంటాం. అయితే కొన్నిసార్లు ఈ డబ్బు బలుపు ఎదుటి వాళ్లు కూడా మనుషులే అనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. తాజాగా చైనాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

చైనాలోని ఓ పెట్రోల్ పంప్ లో పని చేస్తున్న మహిళ పట్ల ఓ డబ్బున్న వ్యక్తి ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడే ఉన్న మహిళా ఉద్యోగి చేత ఇంధనం కొట్టించాడు. తర్వాత ఆ మహిళ సదరు కారులోని వ్యక్తిని డబ్బులు అడగగా.. అతడు డబ్బును మర్యాదగా ఇవ్వడానికి బదులు.. నేలకేసి కొట్టడం జరిగింది. తర్వాత కారు అక్కడి నుండి వెళ్లిపోయింది.

కారులో ఇంధనం నింపుకున్న తర్వాత తనకు మర్యాదగా ఇవ్వాల్సిన డబ్బును కారులోని వ్యక్తి.. డబ్బు మదంతో నేలకేసి కొట్టడం అక్కడ పని చేస్తున్న మహిళకు అవమానంగా అనిపించింది. ఆమె డబ్బు నేల మీద నుండి తీసుకున్నా కానీ తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆ డబ్బు మదంతో ఉన్న వ్యక్తి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి నడిపే కారును ఏ పెట్రోల్ పంపుల్లోకి ప్రవేశించకుండా నిషేధించాలని కొంతమంది డిమాండ్ చేస్తూ కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు..‘తమ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల వారు ఎలా ప్రవర్తిస్తారో చూస్తే వారి నిజ స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది’ అని ఇంకె నెటిజన్..‘ఎందుకు? ప్రజలు నీచంగా ఎందుకు ఉండాలి? కారణం లేదు! ఇది మంచిగా ఉండటానికి ఏమీ ఖర్చు కాదుకదా?’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ కామెంట్ లో ‘కర్మ ఇలాంటి వ్యక్తులను పట్టిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మహిళ ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు. నేను ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, ఈ ఘటన బాధిస్తోంది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

  Last Updated: 06 Feb 2023, 10:33 PM IST