ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై నారింజ పండ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పొగమంచు కారణంగా అనేక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా దట్టమైన పొగమంచు కారణంగా నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న పండ్లన్నీ రోడ్ ఫై పడ్డాయి. ఇది గమనించిన స్థానికులు పోటీపడి..సంచుల్లో పండ్లన్నీ నింపుకొని వెళ్లారు. క్షణాల్లో పండ్లన్నీ మాయం కావడం తో సదరు లారీ డ్రైవర్ లబోదిబోమన్నాడు. కొందరు అయితే ఒకేసారి నాలుగైదు సంచుల్లో పండ్లనీ నింపుకొని వెళ్లారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
పండ్ల లారీ బోల్తా.. ఎగబడి పండ్లని ఎత్తుకుపోయిన జనం
నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీలోని నారింజ పండ్లన్నీ కిందపడ్డాయి. స్థానికులు ఎగబడి పండ్లను సంచుల్లో నింపుకుని… pic.twitter.com/MIWHfumtB2
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2024
Read Also : Bellamkonda Srinivas : బెల్లంకొండ సినిమాకు వెరైటీ టైటిల్.. పవన్ వద్దనుకున్నా అతను కావాలన్నాడు..!