Site icon HashtagU Telugu

Pet Dog : యజమాని మరణం జీర్ణించుకోలేక పెంపుడు కుక్క మరణం

Death Of A Pet Dog

Death Of A Pet Dog

తరాలు మారేకొద్దీ మనిషి బుద్ధి మారుతుందని నేటి మానువుడు నిరూపిస్తే.. ఎన్ని జన్మలెత్తినా మరెన్ని తరాలు గడచినా కుక్కకున్న విశ్వాసం మరే జీవిలో ఉండదని ఓ శునకం ( Pet Dog) నిరూపించింది. కుక్క.. విశ్వాసానికి మారుపేరు అని చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి దాని కడుపు నింపితే.. చచ్చేదాకా అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది. కుక్కల విశ్వాసాన్ని నిరూపించే ఎన్నో ఘటనలను మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. యజమాని మరణాన్ని జీర్ణించుకోలేక అది కూడా మరణించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి (Thummeti Sammi Reddy) గత నెల 14న గుండెపోటుకు గురై మరణించారు. సమ్మిరెడ్డికి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. గత పన్నెండు సంవత్సరాల క్రితం క్యాచ్ ఫర్ ల్యాబ్ జాతికి చెందిన శునకాన్ని (Thummeti Sammi Reddy Pet Dog) పెంచారు. ఎంతో ప్రేమగా ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూశారు. సమ్మిరెడ్డి సెప్టెంబర్ 14న గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆయన పెంచిన శునకం సమ్మిరెడ్డి మృతదేహం వద్ద నుంచి కదలలేదు. మౌనంగా రోదిస్తూ ఫోటో వద్దనే పడిగాపులు కాచింది. సమ్మిరెడ్డి మృతితో ఇంటికి వచ్చి పరామర్శించే వారిని ఎంతో విచారంతో చూసేది. శునకం పడే బాధను చూచి బంధుమిత్రులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. సమ్మిరెడ్డి మృతి చెంది సరిగ్గా నెలరోజులకు ఈ నెల 14న రాత్రి ఆ శునకం కూడా ప్రాణాలు విడిచింది. సమ్మిరెడ్డి నెలమాషికం రోజున్నే శునకం ప్రాణాలు (Thummeti Sammi Reddy Pet డాగ్ Dies) వదలడంతో కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శునకానికి అంతిమ సంస్కారం నిర్వహించారు.

Read Also : Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం