Viral Video : హాస్పటల్ లో లేచిన శవం..పరుగులు పెట్టిన వ్యక్తి

సోషల్ మీడియా (Social Media ) పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాంక్ వీడియోస్ విపరీతమైన వ్యూస్ సాధిస్తూ..అందర్నీ నవ్వుల్లో ముంచెత్తున్నాయి. కాకపోతే కొన్నిసార్లు ఫ్రాంక్ వీడియోస్ ద్వారా అనర్దాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఫ్రాంక్ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ వ్యక్తి హాస్పటల్ (Hospital) వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉండగా .. స్టెచర్‌పై మృతదేహాన్ని (Dead Body) తీసుకుని డాక్టర్ వస్తాడు.. తర్వాత […]

Published By: HashtagU Telugu Desk
The Dead Body In The Hospit

The Dead Body In The Hospit

సోషల్ మీడియా (Social Media ) పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాంక్ వీడియోస్ విపరీతమైన వ్యూస్ సాధిస్తూ..అందర్నీ నవ్వుల్లో ముంచెత్తున్నాయి. కాకపోతే కొన్నిసార్లు ఫ్రాంక్ వీడియోస్ ద్వారా అనర్దాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఫ్రాంక్ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి హాస్పటల్ (Hospital) వెయింటింగ్ హాల్లో కూర్చుని ఉండగా .. స్టెచర్‌పై మృతదేహాన్ని (Dead Body) తీసుకుని డాక్టర్ వస్తాడు.. తర్వాత మృతదేహానికి సంబంధించిన గుర్తులను సేకరిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి.. ఇదంతా గమనిస్తూ అలాగే సైలెంట్‌గా మృతదేహాన్ని గమనిస్తుంటాడు. ఇంతలో మృతదేహం కాలు కదిలిస్తుంది. దీన్ని చూడగానే కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. ఇలా మృతదేహం తన కాళ్లను రెండు సార్లు కదిలించగానే.. ”వామ్మో..! ఇదేంట్రా శవం కదులుతోంది”.. అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి, కుర్చీల వెనక్కు వెళ్లిపోతాడు. తర్వాత పడుకున్న శవం కాస్తా.. ప్రాణంతో పైకి లేచి కూర్చుంటుంది. దీన్ని చూడగానే ఆ వ్యక్తి కుర్చీల కింద నుంచి దూరిమరీ బయటికి పారిపోతాడు. ఈ క్రమంలో శవం లాగా నటించిన వ్యక్తి.. అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే అతను ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు ఫుల్ గా నవ్వుకుంటున్నారు.

మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

  Last Updated: 14 Mar 2024, 11:12 PM IST