Site icon HashtagU Telugu

పెళ్లి వేడుకలో డ్రమ్స్ వాయించిన వధువు..నెటిజన్లు ఫిదా తండ్రి, వరుడితో కలిసి చెండా మేళం వాయించిన నవ వధువు

Kerala Bride Play Chanda 3cxpyqsn5r

Kerala Bride Play Chanda 3cxpyqsn5r

పెళ్లి వేడుకలో నవ వధువు వారెవ్వా అనిపించింది. సంగీత వాయిద్యం అయిన చెండా మేళం డ్రమ్స్ ను వాయిస్తూ వధువు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ లో దేవానంద్ తో శిల్పా శ్రీకుమార్ అనే యువతి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో వధువు శిల్ప చెండా మేళం వాయించి అందర్నీ ఆకట్టుకుంది. కేరళలోని పెళ్లి వేడుకల్లో చెండా మేళం వాయించడం ఆనవాయతీగా వస్తోంది.

తన పెళ్లి వేడుకలో శిల్ప ఇలా చెండా మేళం వాయించడం, వేడుకలో తన తండ్రి పాటు వరుడు కూడా ఆమెతో చెండా మేళం వాయించడం అందర్నీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో @LHBCoach అకౌంట్ నుంచి ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గురువాయూరు ఆలయంలో కళ్యాణం జరిగిందని, వధువు తండ్రి చెండా మాస్టర్ కావడం వల్ల ఆమె కూతురు పెళ్లి రోజు ఉత్సాహంగా చెండా వాయించిందని, ఇదెంతో శుభ పరిణామమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శిల్ప కూడా చెండా మేళం వాయించడం నేర్చుకుంటోంది. అందుకే ఈమె చెండా మేళంను ఇంత అద్భుతంగా వాయించిందని అందరూ అంటున్నారు.

వధువు శిల్ప ఇలా ఉత్సాహంగా చెండా మేళం వాయించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన పబ్లిక్ అకౌంట్ లో తన వీడియోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వధూవరులు ఎంతో ప్రేమ, సంతోషాన్ని వ్యక్తం చేశారని, వారికి అందమైన జీవితం ప్రాప్తించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిల్ప ప్రసన్న కుమార్ వాయించిన చెండా మేళం వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.