Viral Video: రెచ్చిపోయి డాన్స్ చేసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్!

  • Written By:
  • Updated On - January 30, 2023 / 09:46 PM IST

Viral Video: ఈ మధ్య పెళ్లి పీటలపై జరుగుతున్న సంఘటనలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు చేసే వింత చేష్టలతో ఆ పెళ్లిళ్లు వైరల్ ఐపోయితున్నాయి. వాటికీ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఇలాంటి పెళ్లి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతము వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను నెటిజెన్స్ తెగ లైక్స్, షేర్స్ చేస్తూ, కామెంట్స్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది ఆ వీడియో. ఇంతకీ ఏం జరిగింది. ఏంటా వీడియో మీరే చూడండి.

ఓ పెళ్ళిలో అంతా బానే ఉంది. అక్కడ ఉన్న పిల్లలు మరికొంత మంది అక్కడే పాటలు పెట్టి డాన్సులు వేస్తున్నారు. మంచి సౌండ్ లాగించి, డాన్స్ చేస్తున్నారు వారు. అలా ఒక హిందీ పాట పెట్టుకుని డాన్స్ చేస్తుండగా చూస్తున్న వారందరూ చూసి మురిసిపోతున్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒక్కసారిగా ఆ పెళ్లి పీఠలపై ఉన్న వధువు స్టెప్ వేసేసింది. దీనితో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ప్రక్కనే ఉన్న పెళ్లి కొడుకు కూడా ఆశ్చర్యపోయారు. ఇక అందరూ చూస్తుండగానే ఆ వధువు చిందేసింది. ప్రస్తుతము ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఆ హిందీ పాట వినగానే ఊపు వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఆ అమ్మాయి ఒక్కసారిగా డాన్స్ చేయడంతో చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మొదట పెళ్ళికొడుకు, పెళ్లికూతురు స్టేజిపైకి ఎక్కినప్పుడు హిందీ పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు. కొంతసేపటికి పెళ్లికూతురు కూడా వారితో కాలు కలిపి డాన్స్ చేసేసింది. దీనితో అక్కడున్న వారందరూ చూసి షాక్ అయ్యారు. తాను కాలు కదపడంతో పిల్లలు మరింత ఉత్సాహంగా స్టెప్స్ వేసారు.

ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనితో నెటిజెన్స్ రకరకాలుగా కమిన్స్ చేస్తున్నారు. మొత్తానికి వీడియో బాగా వైరల్ అవుతోంది. వివిధ సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా యువతీ యువకులు వారికి సంబంధించిన వారికి ఈ వీడియో అటాచ్ చేస్తూ వారిని ట్యాగ్ చేస్తూ షేర్స్ చేస్తున్నారు. మొత్తానికి తన పెళ్ళికి వచ్చిన వారందరినీ అలరించింది ఆ పెళ్లి కూతురు.