Site icon HashtagU Telugu

CEIR Portal : మీ ఫోన్ పోయిందా..భయపడకండి..ఇలా చేస్తే మీ ఇంటికే వచ్చేస్తుంది

Phone Missing

Phone Missing

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి..ఒకప్పుడు ఫోన్ చేతిలో ఉంటె ఎంతో గొప్పగా చూసేవారు..కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ లేకపోతే అబ్బే అంటున్నారు. అంతలా ఫోన్ వాడకం పెరిగింది. తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, ఫ్రీ ఇంటర్ నెట్ లు , గేమ్స్ , యూట్యూబ్, వీడియో కాల్స్ ఇలా అన్ని వాడుకలో ఎక్కువ అవ్వడం తో చాలామంది ఫోన్లు వాడుతున్నారు. చాలామంది ఫోన్లు వాడడం వల్ల..ఫోన్ దొంగతనాలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ప్రయాణం చేసే టైములో దొంగలు చాల తెలివిగా ఫోన్లు దొంగతనాలు చేస్తున్నారు. అంతే స్పీడ్ గా స్విచ్ అఫ్ చేసి పడేస్తున్నారు. దీంతో తమ ఫోన్ జడ తెలియక చాలామంది పోతే పోనీ అని లైట్ తీసుకుంటున్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేయమన్న చేయడం లేదు. కానీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే మీ ఫోన్ వెంటనే దొరుకుతుందని పోలీసులు చెపుతున్నారు.

సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్‌సైట్ అందుబాటులోకి రావడంతో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం బాగా పెరిగిందని, పోయిన ఫోన్ లు వెంటనే దొరుకుతున్నాయని పోలీసులు చెప్పుకొస్తున్నారు. మొబైల్ పోయిన వెంటనే ముందుగా చేయాల్సింది దగ్గర్లోని మీసేవ సెంటర్ కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెపుతున్నారు. ఆ ఫిర్యాదు కాపీతో అదే నెంబర్ తో కొత్త సిమ్ తీసుకోవాలని, దీంతో పాత నెంబర్ (పోగొట్టుకున్న ఫోన్ లోని) బ్లాక్ అయిపోతుంది, ఫోన్ మాత్రం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లోకి వెళ్లి బ్లాక్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే, పోయిన ఫోన్ లో సేవ్ చేసిన కొన్ని నెంబర్లు, ఈఎంఐ నెంబర్ సహా అడిగిన వివరాలను నమోదు చేయాలన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఆ ఫోన్ ను బ్లాక్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మీ ఫోన్ దొరికిన వాళ్లు లేదా కొట్టేసిన వాళ్లు అందులో కొత్త సిమ్ వేసి వాడుకునేందుకు ట్రై చేయడం తో ఆ సిమ్ నెంబర్, ఫోన్ ఉన్న లొకేషన్ వివరాలతో పోలీసులతో పాటు బాధితుడికీ మెసేజ్ వస్తుందని వివరించారు. ఆ నెంబర్ కు కాల్ చేసి ఫోన్ తిరిగివ్వాలని లేదంటే దొంగతనం కేసు నమోదు అవుతుందని హెచ్చరిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఫోన్ ను తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారని, గడిచిన మూడు నెలల వ్యవధిలోనే ఇలా 7 వేల ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించామని తెలిపారు. సో ఫోన్ పోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీము చెప్పినట్లు చేయాలనీ బాధితులను పోలీసులు కోరుతున్నారు.

Read Also : Gold Man Visits : తిరుమలలో ప్రత్యేక్షమైన గోల్డ్ మాన్..చూసేందుకు పోటీపడ్డ భక్తులు