Boy Survives 100 FT Fall : 100 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయిన బాలుడు.. ఏమైంది ?

Boy Survives 100 FT Fall : అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో కొలరాడో నదీ ప్రవాహం వెంట అద్భుతమైన గ్రాండ్ కేనియన్ లోయ ఉంది.

  • Written By:
  • Updated On - August 14, 2023 / 11:07 AM IST

Boy Survives 100 FT Fall : అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో కొలరాడో నదీ ప్రవాహం వెంట అద్భుతమైన గ్రాండ్ కేనియన్ లోయ ఉంది. గ్రాండ్ కేనియన్ కొండచరియలు 277 మైళ్ళ పొడవు (446 కిలోమీటర్లు), 18 మైళ్ళ వెడల్పు (29 కిలోమీటర్లు), 1 మైలు లోతు (6, 000 నుండి 18, 000)లో ఉన్నాయి. వీటిని చూడటానికి నిత్యం టూరిస్టులు వెళ్తుంటారు.. తాజాగా వ్యాట్  కౌఫ్ మ్యాన్ (Wyatt Kauffman) అనే 13 ఏళ్ల బాలుడు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తు నుంచి గ్రాండ్ కేనియన్ లోయలోకి పడిపోయాడు..  కొండ అంచుల్లో నిలబడి ఉండగా.. అతడు ఒక్కసారిగా లోయలోకి కుప్పకూలాడు. దీంతో అతడు చనిపోయి ఉంటాడని అక్కడున్న పర్యాటకులు అనుకున్నారు.  వ్యాట్  కౌఫ్ మ్యాన్  పేరెంట్స్ గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టారు.

Also read : Rains From August 20 : తెలంగాణలో వానలు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే ?

వెంటనే 20 మందితో కూడిన రెస్క్యూ టీమ్  ఆపరేషన్ ను నిర్వహించి ఆ బాలుడిని రక్షించింది. అయితే బాలుడిని కాపాడేందుకు రెండు గంటల సమయం పట్టింది. 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో వ్యాట్  కౌఫ్ మ్యాన్  తొమ్మిది వెన్నుపూసలు విరిగిపోయాయి. ప్లీహము(Boy Survives 100 FT Fall) పగిలిపోయింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. చేయి విరిగింది. బాలుడిని లోయ నుంచి  పైకి తీసుకొచ్చిన వెంటనే చికిత్స కోసం విమానంలో లాస్ వెగాస్ లోని ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని వ్యాట్  కౌఫ్ మ్యాన్ తండ్రి  బ్రియాన్ కౌఫ్ఫ్మన్ చెప్పారు.  “మేము అదృష్టవంతులమే.. మా పిల్లవాడిని తిరిగి ప్రాణాలతో దక్కించుకున్నాం” అని ఆయన తెలిపారు.

Also read : Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు