Site icon HashtagU Telugu

Viral Video : క్రాకర్లు పేలుస్తూ బైక్‌పై స్టంట్.. ఏమైందంటే ?

Viral Video

Viral Video

Viral Video : తమిళనాడులోని తిరుచ్చిలో ఒక వ్యక్తి  బైక్‌పై విన్యాసాలు చేస్తూ పటాకులు కాల్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డేంజరస్‌గా చేసిన ఈ స్టంట్‌కు సంబంధించిన  వీడియో చివరకు పోలీసులకు చేరింది. దీంతో ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 279, 286, 336 కింద కేసులు నమోదు చేశారు. ఒకవేళ పటాకులు ఆ బైక్‌లోని ఇంధన ట్యాంకుపై పడి ఉంటే.. అది పేలిపోయి ఉండేదని పోలీసులు చెప్పారు. ప్రజలు తిరిగే రోడ్లపై ఇలాంటి చేష్టలు ఎవరికీ మంచివి కావని హితవు పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

బైక్‌పై పటాకులు కాలుస్తూ తాను చేసిన విన్యాసాల వీడియోను ఆ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘డెవిల్ రైడర్’లో పోస్ట్ చేశాడు. ఏకంగా ప్యాంటు జిప్‌ భాగం నుంచి ఒక క్రాకర్‌ను పేల్చిన సీన్ కూడా ఈ వీడియోలో ఉంది. దీనికి 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి స్టంట్లు చేయకూడదని ఆ యువకుడికి హితవు పలికారు. మరోవైపు ఇదే వీడియోను గబ్బర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా 10 లక్షల వ్యూస్(Viral Video) వచ్చాయి.

Also Read: Ajay Bhupathi: మంగళవారం’లో జీరో ఎక్స్‌పోజింగ్, చివరి 45 నిమిషాల్లో ట్విస్టులు నెట్స్ట్ లెవల్‌