YouTuber Irfan: జెండర్ రివీల్ పార్టీతో బుక్కైన తమిళనాడు యూట్యూబర్

పుట్టబోయే బిడ్డ లింగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించినందుకు ప్రముఖ తమిళ యూట్యూబర్ మరియు ఫుడ్ వ్లాగర్ ఇర్ఫాన్‌కు తమిళనాడు ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

YouTuber Irfan: పుట్టబోయే బిడ్డ లింగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించినందుకు ప్రముఖ తమిళ యూట్యూబర్ మరియు ఫుడ్ వ్లాగర్ ఇర్ఫాన్‌కు తమిళనాడు ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. జెండర్ రివీల్ పార్టీ, ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PC-PNDT) చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చట్టపరమైన చర్యలకు దారితీసింది.

భారతదేశంలో పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ మరియు బహిర్గతం చేయడాన్ని నిషేధించే చట్టాన్ని ఉల్లంఘించినందుకు స్టేట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ మరియు మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ఇర్ఫాన్‌కి నోటీసు జారీ చేశారు. మే 18న ఇర్ఫాన్‌ ఈ పోస్ట్ విడుదల చేశాడు. దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో ఇర్ఫాన్‌ మరియు అతని భార్య లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. మే 2న వారు ఆసుపత్రికి వెళ్లినట్లు వీడియో చేసి, ఆ తర్వాత వారు చెన్నైలో ‘జెండర్ రివీల్’ పార్టీని నిర్వహిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. భారతదేశంలో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమైనప్పటికీ, ఇతర దేశాలలో వాటికి అనుమతి ఉందని ఇర్ఫాన్ వీడియోలో పేర్కొన్నాడు.

4.28 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న అతని యూట్యూబ్ ఛానెల్‌లో వారి దుబాయ్ ట్రిప్‌తో పాటు జెండర్ రివీల్ పార్టీని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. జెండర్ రివీల్ వీడియోని 2 మిలియన్లకు పైగా చూడటంతో వీడియో వైరల్ గా మారింది. కుమార్తె అని తెలిసి ఇర్ఫాన్ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా యూట్యూబ్ నుండి ఈ వివాదాస్పద వీడియోను తీసివేయాలని ఆరోగ్య శాఖ సైబర్ క్రైమ్ అధికారులను ఆదేశించింది.

లింగ ఆధారిత అబార్షన్‌లను నిరోధించడం మరియు పుట్టబోయే పిల్లల భద్రత మరియు హక్కులను నిర్ధారించడం లక్ష్యంగా PC-PNDT చట్టం కారణంగా పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని బహిర్గతం చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం.

Also Read: Uttarakhand: అర్ధనగ్నంగా యువకుల పార్టీ.. వైరల్ వీడియో