8 Seconds – 118 Elements : స్పీడ్ అంటే ఇదే.. 8 సెకన్లలోనే 118 రసాయన మూలకాలను చదివేసింది  

8 Seconds - 118 Elements : ఆ స్టూడెంట్ ఆవర్తన పట్టికలోని 118 రసాయన మూలకాల పేర్లను  కేవలం 8 సెకన్లలో గడగడా చదివింది. 

Published By: HashtagU Telugu Desk
8 Seconds 118 Elements

8 Seconds 118 Elements

8 Seconds – 118 Elements : ఆ స్టూడెంట్ ఆవర్తన పట్టికలోని 118 రసాయన మూలకాల పేర్లను  కేవలం 8 సెకన్లలో గడగడా చదివింది. తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలోని కడయనల్లూరుకు చెందిన సబ్రీన్ ఈ అద్భుత మెమొరీ ఫీట్ ను చేసి అందరితో వహ్వా అనిపించుకుంది. దీంతో ఆవర్తన పట్టికను స్పీడ్ గా చదివే విషయంలో ఆమె సరికొత్త వరల్డ్ రికార్డును సృష్టించింది.  సబ్రీన్ ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది.  ఇంతకుముందు 2004లో కేరళలోని కొల్లమ్‌కి చెందిన వీ.ఎస్. శివాని 17 సెకన్ల 47 మిల్లీసెకన్‌లలో  ఆవర్తన పట్టికను చదివింది. ఇప్పుడు ఆ రికార్డును సబ్రీన్ తిరగరాసింది.

Also read : BRS Tickets: రాజయ్యకు బిగ్ షాక్, కడియం ను ఖరారు చేసిన కేసీఆర్

కడయనల్లూరులోని మస్జిద్ థైకా హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న సబ్రీన్.. 11వ తరగతి నుంచే ఈ మెమొరీ ఫీట్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆమె తండ్రి డ్రైవర్‌, తల్లి గృహిణి. అయినప్పటికీ సబ్రీన్ సంకల్పం ముందు రికార్డు సాగిలాపడింది. త్వరలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారుల ముందు కూడా ఆమె ఆవర్తన పట్టికను చదవనుంది. వాస్తవానికి ఆవర్తన పట్టికను చదవడానికి కనీసం 13 సెకన్ల టైం అవసరం. కానీ  సబ్రీన్ అచంచలమైన కృష్టి వల్ల.. ఆవర్తన పట్టికను 8 సెకన్లలోనే (8 Seconds – 118 Elements) చదవగలిగింది.

  Last Updated: 21 Aug 2023, 03:51 PM IST