Site icon HashtagU Telugu

Tamilnadu: పేస్ బుక్ పరిచయం..పెళ్లి.. కానీ చివరికి?

Tamilnadu

Tamilnadu

ఈ మధ్యకాలంలో చాలామంది యువత సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని ప్రేమ పెళ్లి అంటూ జీవితాలను నాశనం తీసుకోవడంతో పాటు కొందరు మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా ఫేస్ బుక్ పరిచయాలు ప్రేమ పెళ్లిళ్లు చివరికి చావులకు కూడా దారితీస్తున్నాయి. ముక్కు ముఖం తెలియని వారితో చాటింగ్లో చేయడం డేటింగ్ లు చేయడం ఫోటోలు పంచుకోవడం న్యూడ్ కాల్స్ ఇలా రకరకాల కారణాలతో చాలామంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొందరు చాలామంది కేటుగాళ్లు ఈ ఆన్లైన్ వేదికగా అమాయకులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన నవవధువు చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపూర్‌ జిల్లా ఉడుమలైపేటకు చెందిన మయిలత్తాల్‌ అని 65 ఏళ్ల వ్యక్తి మనవరాలు భూమిక అని 20 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. భూమిక, అదే ప్రాంతానికి చెందిన అబ్బాయి సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే తిరుచ్చికి చెందిన రఘు అనే 25 ఏళ్ళ వ్యక్తితో భూమికకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. తల్లిదండ్రుల అంగీకారంతో జూలై 5న అతడితో వివాహం జరిగింది. భూమిక రఘుతో కలిసి తిరుచ్చిలో నివసిస్తూ వచ్చింది.

కొద్ది రోజుల క్రితం ఉడుమలైపేటకు వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడికి అమ్మమ్మ రాగా సహజీవనం చేసిన వ్యక్తి చనిపోయాడిని తెలిసి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది. కాగా భూమిక చికిత్స పొందుతూ తాజాగా గురువారం మృతి చెందింది.

Exit mobile version