రాజస్థాన్‌లోని జైపూర్ నగరం ఇప్పుడు ఒక అరుదైన స్వీట్ కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంజలి జైన్ అనే మహిళ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ అనే మిఠాయి కేజీ ధర ఆశ్చర్యకరంగా రూ.1.11 లక్షలు. సాధారణంగా పండుగల సమయంలో కేజీకి రూ.2వేల వరకూ ఉన్న మిఠాయిలు మనం చూస్తుంటాం. అయితే ఈ మిఠాయి మాత్రం విలువైన ఔషధ పదార్థాలతో, ఖరీదైన లోహాలతో తయారవడం వల్లే దీని ధర ఇంత ఎక్కువగా ఉందని అంజలి జైన్ తెలిపారు. ఈ స్వీట్‌ను చిల్గోజా (పైనట్), కుంకుమపువ్వు (సాఫ్రాన్) వంటి అరుదైన పదార్థాలతో పాటు స్వర్ణ భస్మం కలిపి, పైపైన బంగారం పూతతో అలంకరించారు.
Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు
అంజలి జైన్ ప్రకారం, ఆయుర్వేదంలో స్వర్ణ భస్మానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించి, మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా, చాంది భస్మ కూడా శరీరానికి చల్లదనం ఇచ్చి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నమ్మకం. ఈ స్వీట్ తయారీ సమయంలో బంగారం, వెండి, కుంకుమపువ్వు వంటి పదార్థాల నిష్పత్తిని జాగ్రత్తగా పాటించి, దాని ఔషధ గుణాలను కాపాడేలా తాయారు చేస్తారని ఆమె వివరించారు.
‘స్వర్ణ ప్రసాదమ్’ కేవలం మిఠాయిగా కాకుండా ఆరోగ్యపరమైన విలువలతో కూడిన ప్రత్యేక ప్రసాదంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది జైపూర్‌లో ఉన్న హై–ఎండ్ గిఫ్ట్ షాపుల్లో, రాయల్ ఫ్యామిలీల ఆర్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలో ఆరోగ్యపరమైన ఫుడ్ ప్రోడక్ట్స్‌కి పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో, ఈ రకమైన సృజనాత్మక ఆహార ఉత్పత్తులు భవిష్యత్తులో కొత్త దిశను చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.