Super Dog : సూపర్ డాగ్.. ఐదు అంతస్తుల నుంచి దూకినా ఏమీ కాలేదు !!

Super Dog : మనం భవనం మొదటి అంతస్తు నుంచి దూకినా కాళ్లు చేతులు విరగడం ఖాయం. అలాంటిది ఓ కుక్క సాహసం చేసింది.

Published By: HashtagU Telugu Desk
Dog Jump Viral

Dog Jump Viral

పైన ఉన్న వీడియోను చూడండి..  నిర్మాణంలో ఉన్న భవనం ఇది. ఇందులోని ఐదో అంతస్తులో చివరన కుక్క నిలబడి ఉంది. అది ఏమీ ఆలోచించకుండా అమాంతం కిందికి దూకేసింది. కిందకు ల్యాండ్ అయ్యే క్రమంలో.. భవనం గోడకు తన కాళ్లను సపోర్ట్ గా చేసుకుంది. కిందపడగానే లేచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది.  అయినా ఆ కుక్కకు గాయాలు కాకపోవడం గమనార్హం.  ఈ సూపర్ డాగ్ కు సంబంధించిన వీడియో ఫుటేజీ అమెరికాలోని టెక్సాస్ ఏరియాకు చెందినదని (Super Dog) తెలుస్తోంది.

Also Read: Bombing On Historical Church : గాజాలోని పురాతన చర్చిపై ఇజ్రాయెల్ బాంబుదాడి

  Last Updated: 20 Oct 2023, 05:45 PM IST