Kumari Aunty : కుమారి ఆంటీకి సినీ హీరో మద్దతు..తప్పకుండా సాయం చేస్తానని భరోసా ..!!

ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి..కుమారి ఆంటీ షాప్ ను ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదా..? ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు […]

Published By: HashtagU Telugu Desk
Sundeep Kishan Kumari

Sundeep Kishan Kumari

ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి..కుమారి ఆంటీ షాప్ ను ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదా..? ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు యూట్యూబర్స్ .. హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు..మెను కార్డు నుండి ప్రతిదీ కవర్ చేస్తూ వైరల్ చేసారు. ఈ వీడియోస్ చుసినా జనాలంతా ఈమె దగ్గరికి వాలిపోయారు. ఈమె దగ్గర ఫుడ్ తినానాలంటే కనీసం గంటకు పైగా వెయిట్ చేయాల్సదే..అంటే అర్ధం చేసుకోవాలి..ఈమె దగ్గరికి ఎంతమంది వస్తున్నారో..ఈమె దగ్గర జనాలు చూసి స్టార్ హోటల్స్ సైతం ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. ఫలితంగా.. రద్దీ ఎక్కువైపోయి, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో.. ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జాం అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారడంతో మంగళవారం ఈమె షాప్ ను క్లోజ్ చేయించారు ట్రాఫిక్ పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో కుమారి ఆంటీ మీడియా ముందుకు వచ్చిన తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ఆంటీకి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) మద్దతుగా నిలిచారు. ఎంతో మంది వ్యాపారం చేసే మహిళలకు ఆమె స్ఫూర్తి అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. సాధ్యమైనంత వరకూ ఆమెకు సాయం చేస్తానన్నారు. దీంతో కుమారి ఆంటీ అభిమానులు సందీప్ కిషన్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి సందీప్ సైతం ఓ సరి కుమారి దగ్గరికి ఫుడ్ రుచి చూసాడు..అప్పటి నుండి ఈమె మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆయన కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మరి కుమారి మళ్లీ షాప్ ఓపెన్ చేస్తుందా..? లేక మరోచోట షాప్ పెడుతుందా అనేది చూడాలి.

Read Also : Tamil Nadu Temples : ఆలయం పిక్నిక్ స్పాట్ కాదు.. హిందూయేతరుల ప్రవేశంపై కోర్టు సంచలన ఆదేశాలు

  Last Updated: 31 Jan 2024, 11:20 AM IST