Site icon HashtagU Telugu

Bihar: జనాలను ఆకట్టుకుంటున్న నాలుగు కళ్ళ నల్లని చేప.. ఫొటోస్ వైరల్?

Bihar

Bihar

మాములుగా మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి సముద్రంలో నదులలో వింత వింత చేపలు చిక్కుతూ ఉంటాయి. అలా గతంలో చాలా వింత చాపలు ఎప్పుడూ చూడని చేపలు మత్స్యకారులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి చాప అయినా కూడా చేపలకు రెండు కళ్ళు ఉంటాయి. కానీ తాజాగా మసకారులకు దొరికిన ఒక చేప చూడడానికి విమానంలా కనిపించడంతో పాటు నాలుగు కళ్ళు ఉండడంతో ఆ చేపను చూడడానికి జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. బీహార్‌లోని బెతియా జిల్లాలో మత్స్యకారుల వలకు విచిత్రమైన చేప చిక్కింది. ఆ చేపను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బెతియా జిల్లాలలోని లాకఢ్‌ గ్రామంలోని మత్స్యకారుల చేతికి ఈ చేప చిక్కింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో వల వేసినప్పుడు వారికి ఈ చేప చిక్కింది. తొలిసారి చూసినప్పుడు ఈ చేప విమానం మాదిరిగా కనిపించిందట. కాగా ఈ చేప నల్లని చారలను కలిగివుంది. దానికి నాలుగు కళ్లు కూడా ఉన్నాయి. ఈ చేపను సకెర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ అని అంటారు.

ఈ తరహా చేపలు సాధారణంగా అమెరికాలో ప్రవహించే నదులలో ఎక్కువగా కనిపిస్తాయి. వింతగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు సమీపగ్రామ ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ తరహా చేపలు ఇతర చేపల గుడ్లను తినేస్తుంటాయి. ఫలితంగా ఈ చేపలు ఇతర చేపల మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరేంద్ర చౌదరి ఇక్కడికి సమీపంలోని నదిలో ఇటువంటి రెండు చేపలను పట్టుకున్నారు. ఈ చేపలను వీరేంద్ర చౌదరి తన ఇంటిలో సురక్షితంగా ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ చేపను అందం కోసం జనం ఇంటిలోని ఫిఫ్‌ అక్వేరియంలలో ఉంచుతారు. అయితే ఎవరో ఇటువంటి చేపలను నదిలో విడిచిపెట్టి ఉంటారు. ఫలితంగా ఈ చేపలు మరింత వృద్ధి చెంది, గండక్‌, కోసీ గంగా నదులలో కనిపిస్తున్నాయి. అయితే నదిలో ఈ చేపలు ఉండటం పలు జలచరాలకు ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.