Viral : గర్ల్‌ఫ్రెండ్‌ ను రహస్యంగా రూమ్ కు తీసుకొద్దామని అడ్డంగా బుక్ అయినా స్టూడెంట్

Viral : ఓ విద్యార్థి (student ) తన గర్ల్‌ఫ్రెండ్‌(girlfriend )ను పెద్ద సూట్‌కేస్‌(large suitcase)లో దాచిపెట్టి బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు

Published By: HashtagU Telugu Desk
Student Tried To Take Girlf

Student Tried To Take Girlf

హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఒపీజే జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ(OP Jindal Global University)లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న ఓ విద్యార్థి (student ) తన గర్ల్‌ఫ్రెండ్‌(girlfriend )ను పెద్ద సూట్‌కేస్‌(large suitcase)లో దాచిపెట్టి బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సెక్యూరిటీ వద్ద అడ్డంగా దొరికిపోయాడు. విద్యార్థి తీసుకొచ్చిన ఆ లగేజ్‌ బ్యాగ్ పై అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది వెంటనే సూట్‌కేస్‌ను చెక్ చేయగా, అందులో నుంచి ఒక యువతి బయటకొచ్చింది. ఆమెను సురక్షితంగా బయటకు తీసిన గార్డులు, వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఇది క్షణాల్లోనే యూనివర్సిటీలో పెద్ద సంచలనంగా మారింది.

kapilavai Dilip kumar : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా

ఈ ఘటనను పలువురు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో ఆశ్చర్యం, నవ్వు, ఆగ్రహం అన్నీ కలగలిపిన రియాక్షన్ లు ఇస్తున్నారు. దీనిపై ఇంకా యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు. సదరు విద్యార్థి పై ఎలాంటి చర్యలు తీసుకుంటానేది చూడాలి.

  Last Updated: 12 Apr 2025, 04:22 PM IST