జగిత్యాల జిల్లా బతికేపల్లి గ్రామంలో ఉపాధిహామీ పనుల సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలీ పనుల కోసం గ్రామస్తులు పొద్దునే పనికి వెళ్లి, భూమిని తవ్వుతుండగా ఒక వింత శబ్ధం వినిపించింది. మొదట దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, మళ్లీ తవ్వగా అదే శబ్ధం రావడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఆసక్తితో మళ్లీ జాగ్రత్తగా తవ్వగా వారి కళ్ల ముందే ఒక అద్భుత దృశ్యం కనిపించింది. భూమి లోతులో ఏకంగా 20 పురాతన నాణేలు (Ancient Coins) వెలికి వచ్చాయి.
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ రెచ్చిపోతాడా?
నాణేలు లభించడంతో కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ముంజ మహేశ్వరికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమె వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఆర్ఐ జమున ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. మొదట ఈ నాణేలపై ఉన్న భాష ఉర్దూగా అనిపించినా, నిశిత పరిశీలన అనంతరం అవి పర్షియన్ భాషలో ఉన్న పురాతన నాణేలని గుర్తించారు. నాణేలను డీటీఓ కార్యాలయానికి తరలించి, విశేష అధ్యయనం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. నాణేలు దొరికాయనే వార్త గ్రామంలో పాకిపోయి, పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనాస్థలానికి చేరుకొని వాటిని చూడాలని ఉత్సాహం చూపారు. ఊహాగానాలు పెరుగుతుండడంతో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రవి కిరణ్ గ్రామానికి చేరుకుని వివరణ ఇచ్చారు. ఇది గుప్త నిధి కాదని, పురాతన నాణాలుగా గుర్తించామని స్పష్టంచేశారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురికాకుండా, అధికారుల ఆదేశాలను అనుసరించాలని సూచించారు.
Kingfisher Beer : కింగ్ ఫిషర్ బీర్ లో ప్లాస్టిక్ స్పూన్..దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది
ఈ సంఘటన ప్రాంతంలో ఆసక్తిని రేకెత్తించింది. పురాతన నాణాల చరిత్రను తెలుసుకునేందుకు పురావస్తు శాఖ త్వరలో విశ్లేషణ చేపట్టనుంది. నాణేలు ఏ కాలానికి చెందినవి? ఏ రాజవంశానికి చెందినవి? అనే అంశాలపై విశ్లేషణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది భారతీయ చరిత్రకు సంబంధించి కీలక ఆధారంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.