Video Viral: ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సెక్యూరిటీ.. వీడియో వైరల్?

మనం ఫ్యాషన్ షో చూసినప్పుడు కొందరు మోడల్స్ రకరకాల దుస్తులను ధరించి ర్యాంపు వాక్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని రకాల దుస్తులు చూసినప్పుడు ఇంత

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 02:16 PM IST

మనం ఫ్యాషన్ షో చూసినప్పుడు కొందరు మోడల్స్ రకరకాల దుస్తులను ధరించి ర్యాంపు వాక్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని రకాల దుస్తులు చూసినప్పుడు ఇంత దరిద్రమైన బట్టలు కూడా ధరిస్తారా అన్న అనుమానం కూడా రాకమారదు. ఈ మధ్యకాలంలో అయితే మోడల్స్ ధరించే కాస్ట్యూమ్స్ కి హద్దే లేకుండా పోయింది. అయితే ఇలా ఒక విచిత్రమైన కాస్ట్యూమ్ తో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఒక మోడల్ కి ఊహించని సంఘటన ఎదురయింది. మోడల్ స్టైల్ గా ర్యాంపు వాక్ చేస్తుండగా వెంటనే సిబ్బంది అతన్ని పక్కకు ఈడ్చుకెళ్ళారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన న్యూయార్క్ లో చోటు చేసుకుంది. తాజాగా న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడర్న్ లా రెడీ అయి వచ్చిన ఒక యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్‌లా వాక్‌ చేశాడు. పాలిథీన్‌ కవర్‌నే కాస్టూమ్‌గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్‌ చేస్తూ మోడల్‌లానే బిల్డప్‌ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు.

 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే, అతని స్టైల్‌ రియల్‌ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇంకొందరు ఈ మధ్యకాలంలో కాస్ట్యూమ్స్ ఆ విధంగానే చండాలంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.