Site icon HashtagU Telugu

Viral : హన్మకొండలో ఓ విచిత్ర సంఘటన..చనిపోయాడని అనుకుంటే లేచి కూర్చుండు

Wgl Man

Wgl Man

అప్పుడప్పుడు చాల విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొంతమంది చనిపోయారని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయడం..ఆ క్షణంలో లేచి కూర్చోవడం..లేదా చితి మీద పెట్టె టైములో లేవడం వంటివి అందర్నీ షాక్ కు, ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా హన్మకొండలో ఇదే తరహాలో జరిగింది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయాడని భావించి పోలీసులకు సమాచారం అందించగా..తీరా పోలీసులు వచ్చి కదిలించగా లేచి కూర్చున్నాడు. ఈ ఘటన తో పోలీసులు , స్థానికులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..

We’re now on WhatsApp. Click to Join.

హన్మకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని.. బయటికి తీసే ప్రయత్నం చేయగా..లేచి కూర్చున్నాడు. వెంటనే అతడిని పోలీసులు ప్రశ్నించగా.. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పది రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. దీంతో అతని మాటలు విని స్థానికులు పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Modi Cabinet : మంత్రులకు శాఖలు కేటాయించిన మోడీ