Spider Woman: స్పైడర్ ఉమెన్.. ఈమెకు సాధ్యంకానిదంటూ ఏదీ ఉండదేమో!

రియల్ లైఫ్ లో స్పైడర్ మాన్ లాంటివాళ్లు ఉంటారా? అంటే కష్టమేనని చెప్పవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Spider Women

Spider Women

స్పైడర్ మాన్ (Spider Man) అనగానే గాల్లో ఎగరడం, ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు దూకడం, ప్రమాదకరమైన స్టంట్స్ (Stunts) చేయడం లాంటివికి గుర్తుకువస్తాయి చాలామంది. కానీ రియల్ లైఫ్ లో స్పైడర్ మాన్ లాంటివాళ్లు ఉంటారా? అంటే కష్టమేనని చెప్పవచ్చు. స్పైడర్ మాన్ తో పొలికలా సాధ్యమే కాదు సమాధానం వస్తుంది. కానీ ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియా (Social media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసినవారికి ఎవరికైనా వెంటనే స్పైడర్ మాన్ (Spider man) గుర్తుకు రావాల్సిందే.

మనదేశంలో ఆర్టీసీ బస్సులాంటి (Public Bus) పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని చోట్లా అరకొర బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తీవ్ర రద్దీ కారణంగా బస్సు మొత్తం ప్రయాణికులతో నిండిపోతుంటుంది కూడా.  ఎక్కే చోటా, దిగే చోటా ఇబ్బందులు పడాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది ఓ అమ్మాయి. కనీసం ఎక్కడానికి కూడా ప్లేస్ లేకపోవడంతో బస్సు ముందుకు వెళ్తుంది.

వెంటనే అమ్మాయి బస్సు వెంట పరుగుతీసి కిటికీ దగ్గర గ్రిల్ పట్టుకొని అమాంతం క్షణాల్లో బస్సులోకి దూరేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు (Viral Video) కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి ఇప్పటి వరకు 1.6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. “ఓరి దేవుడా! ఏమిటి?!” అంటూ రియాక్ట్ అయ్యారు నెటిజన్స్. “ఒక సంకల్పం ఉంటే, ఒక మార్గం ఉంది, ఆమె లేడీ స్పైడర్ ఉమెన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Robbery Case: నయా దోపిడీ.. చికెన్ వడ్డించారు, కోట్లు దొంగిలించారు!

  Last Updated: 06 May 2023, 02:57 PM IST