Turkey: ఆకాశంలో ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం.. వీడియో వైరల్?

మామూలుగా అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని అద్భుతాలు మెరుపుతీగ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 03:02 PM IST

మామూలుగా అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని అద్భుతాలు మెరుపుతీగ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. కెమెరాలో రికార్డు అయితే తప్ప అలాంటి నిజాలని నమ్మలేము. అయితే ఆకాశంలో జరిగిన అద్భుతాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపించడంతో పాటు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అసలు ఏం జరిగింది అన్న విషయానికి వస్తే.. టర్కీలో తాజాగా రాత్రి సమయంలో ఒక అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితేఅది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది.

 

ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఒక బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదే వీడియోని చాలామంది షేర్ చేయగా ఆ వీడియోలలో ఆ ఉల్కపాతం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లాగా కనిపిస్తోంది.

 

అయితే కొందరు ఆ వీడియోని చూసి అసలు ఏంటి ఇది అని కామెంట్లు చేయగా ఆ కామెంట్ల పై స్పందించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి.

 

అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. ఆ ఉల్క పాతం పాతం వెనుక ఉన్న రహస్యాలు తెలియాలి శాస్త్రవేత్తలు స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.