Site icon HashtagU Telugu

world cup 2023: ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్.. కొడుకుని హత్య చేసిన తండ్రి

world cup 2023

world cup 2023

world cup 2023:  భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. అయితే గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ని చూస్తుండగా యూపీలోని కాన్పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మ్యాచ్ మధ్యలో టీవీ స్విచ్ ఆఫ్ చేసిండన్న కారణంతో తండ్రి కొడుకును చంపేశాడు. అసలే భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ని చూసేందుకు అందరూ టీవీల ముందు చూస్తూ కూర్చున్నారు. చాకేరిలోని అహిర్వాలో నివాసముంటున్న గణేష్ ప్రసాద్, దీపక్ నిషాద్ కూడా టీవీలో మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో కొడుకు దీపక్ టీవీ స్విచాఫ్ చేశాడు. దీంతో తండ్రి గణేష్‌ ప్రసాద్‌తో గొడవకు దిగాడు. పరిస్థితి విషమించడంతో గణేష్ తన సొంత కుమారుడిని కేబుల్‌తో గొంతుకోసి చంపాడు. గత సోమవారం కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టయిన తండ్రి గణేష్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కుటుంబ సభ్యులను విచారించగా గణేష్‌, దీపక్‌లు తరచూ గొడవపడేవారని తేలింది.

Also Read: Election Campaign : వారం మొత్తం తెలంగాణ మోత మోగాల్సిందే..!