Tajmahal: తల్లి కోసం తాజ్ మహల్ కట్టించిన కొడుకు.. నెట్టింట ఫోటోస్ వైరల్?

మాములుగా వ్యక్తులు భార్యకు, తండ్రికి లేదంటే తల్లికి, మనసుకు బాగా నచ్చిన వారికి జ్ఞాపకం గా ఉండడం కోసం అది శాశ్వతంగా నిలిచిపోవడం కోసం ఏదైనా ఇ

Published By: HashtagU Telugu Desk
Taj Mahal

Tajmahal

మాములుగా వ్యక్తులు భార్యకు, తండ్రికి లేదంటే తల్లికి, మనసుకు బాగా నచ్చిన వారికి జ్ఞాపకం గా ఉండడం కోసం అది శాశ్వతంగా నిలిచిపోవడం కోసం ఏదైనా ఇవ్వాలి అనుకుని వాటిని గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు. తల్లి మీద ప్రేమను చాటుకోవడానికి డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాలు, కార్లు, ఇల్లు ఇలా ఎవరితో స్తోమతకు తగ్గట్టుగా వారు జ్ఞాపకంగా ఏదైనా వస్తువు ఇస్తూ ఉంటారు. అయితే అప్పుడెప్పుడో మొగల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ కోసం ఆమెకు జ్ఞాపకంగా ఉండాలి అని తాజ్ మహల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.

తాజాగా ఒక వ్యక్తి కూడా తన తల్లి కోసం ఏకంగా తాజ్ మహల్ ను నిర్మించాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూరు చోటు చేసుకుంది. అతని పేరు అమరుద్దీన్ షేక్ దావూద్. అతను తన తల్లి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ ప్రతిరూపాన్ని నిర్మించాడు. తిరువారూర్ నివాసి అమరుద్దీన్ షేక్ దావూద్ తల్లి జైలానీ బీవీ 2020 సంవత్సరంలో మరణించారు. అమరుద్దీన్ తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, నిజానికి, అమరుద్దీన్ తండ్రి 1989లో మరణించారు. ఇక అప్పటి నుండి అతని తల్లి మాత్రమే ఐదుగురు పిల్లలను పెంచింది.

చిన్న వయసులో తండ్రి చనిపోయిన తల్లి మళ్లీ పెళ్లి చేసుకోకపోవడంతో తల్లిని ప్రేమకు, బలానికి ప్రతీకగా భావించాడు. తన తల్లి అంటే అమరుద్దీన్ షేక్ దావూద్ కి మాటల్లో చెప్పలేని ఇష్టం. 2020లో తల్లి మరణానంతరం అమరుద్దీన్ ఆమెను స్మశాన వాటికకు బదులు తన సొంత భూమిలో పాతిపెట్టి ఆమె జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని నిర్మించారు. డ్రీమ్ బిల్డర్ల సహాయంతో అతను తాజ్ మహల్ ప్రతిరూపాన్ని తయారు చేశాడు. అయితే ఈ తాజా మహల్ నిర్మాణం జూన్ 3, 2021న ప్రారంభమైంది. ఇందులో 200 మందికి పైగా కార్మికులు పనిచేసి 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తాజ్ మహల్ ప్రతిరూపాన్ని తయారు చేశారు. ఈ పనికి 5.5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయబడింది. అతను ఈ భవనాన్ని చారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చాడు.

  Last Updated: 12 Jun 2023, 05:39 PM IST