Snatchers Who Dragged Girl On Bike Held : పంజాబ్‌లో పట్టపగలే దారుణం..

Girl dragged on road in Jalandhar : బైక్ ఫై ముగ్గురు వ్యక్తులు ఆమె నుండి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లక్ష్మి సెల్‌ఫోన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆమెను బైక్ వెంట దాదాపు 350 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
Jalandhar Road After Phone

Jalandhar Road After Phone

Girl dragged on road in Jalandhar during phone snatching : దేశ వ్యాప్తంగా నేరగాళ్లు , కామాంధులు రెచ్చిపోతున్నారు. దోపిడీ చేయడానికి. ఆడవారిపై లైంగిక దాడి చేసేందుకు రాత్రి , పగలు అనేది చూడడంలేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు దాడికి తెగపడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు మీడియా లో వైరల్ అవుతూనే ఉండగా..తాజాగా మరో వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని జలంధర్‌ (Jalandhar )లో శనివారం జరిగిన దారుణ ఘటన అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.

12వ తరగతి చదువుతున్న లక్ష్మి (18) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా…బైక్ ఫై ముగ్గురు వ్యక్తులు ఆమె నుండి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే లక్ష్మి సెల్‌ఫోన్‌ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఆమెను బైక్ వెంట దాదాపు 350 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. చివరకు నేరగాళ్లు సెల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లాక .. ఒక వ్యక్తి వెనక్కు వచ్చి నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. కాగా, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Rahul Gandhi : ఆ తర్వాత భారత్‌లో రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది: రాహుల్‌ గాంధీ

  Last Updated: 10 Sep 2024, 01:27 PM IST