Caught On Camera: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం.. ఎక్కడంటే..?

సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం (Small Plane) తలకిందులుగా కూలిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా బీచ్‌ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం జరిగినట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
plane landing

Resizeimagesize (1280 X 720) (1)

సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం (Small Plane) తలకిందులుగా కూలిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా బీచ్‌ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం జరిగినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు జరిగింది. ప్రమాద సమయంలో బీచ్‌లో ఉన్న వ్యక్తులు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. సింగిల్ ఇంజిన్ విమానం అని, అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. విమానంలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

వాస్తవానికి పైలెట్‌ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. అయితే విమానం పసిఫిక్‌ పాలిసేడ్స్‌ సమీపంలో ఇంజన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్‌ శాంటా మోనికా ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. విమానాన్ని సముద్ర తీరంలో ల్యాండ్ చేయడం ప్రమాదకరమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌ను హెచ్చరించాడు. దీనికి పైలట్ నాకు వేరే ఆప్షన్ ఉంటే బాగుండేదని బదులిచ్చారు.

  Last Updated: 24 Dec 2022, 08:10 AM IST