Site icon HashtagU Telugu

Sleeper Class : ట్రైన్ లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా కూడా వాళ్లకు నిద్రపోయే ఛాన్స్ లేదా.. ఎందుకిలా..?

Sleeper Class Middle Berth Rules Must Know Railway Rules

Sleeper Class Middle Berth Rules Must Know Railway Rules

దూర ప్రయాణాలకు బస్సులో వెళ్లడం కన్నా ట్రైన్ ఫెసిలిటీని వాడుకుంటారు. ఐతే తమ సౌలబ్యాన్ని, ఆర్ధిక స్థితిని బట్టి ట్రైన్ లో జనరల్ నుంచి ఏసీ బోగీల వరకు టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఐతే జనరల్ బోగీల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. అలా అని ఏసీలో వెళ్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని ఎక్కువగా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటారు. ఇందులో వారికి సీట్ ఏది కావాలన్నది ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉన్న ట్రైన అయితే అది కూడా టికెట్ బుక్ అయ్యాక ఏది ఖాళీగా ఉంటే అది ఇస్తారు.

స్లీపర్ క్లాస్ లో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్ (Middle Berth,), అప్పర్ బెర్త్ లు ఉంటాయి. ఒకే ఫ్యామిలీకి చెందిన వారైతే మిడిల్ బెర్త్ ని వాడకుండానే లోయర్, అప్పర్ బెర్త్ లతో అడ్జెస్ట్ అవుతారు. కానీ వేరు వేరు ప్రయాణీకులు అయితే మిడిల్ బెర్త్ వేసి సాటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగేలా చేస్తారు.. ఐతే ఇలాంటి వారి గురించి రైలే శాఖ కొత్త రూల్స్ తెచ్చింది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు..

Sleeper Class మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణీకుడు డే టైం లో అది వేసుకుని పడుకోవడానికి వీలు లేదు. కేవలం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే దాన్ని వేసుకుని పడుకునే అవకాశం ఉంది. ఒకవేళ లోయర్ బెర్త్ లేద అప్పర్ బెర్త్ వాళ్లు సీట్ మార్చుకునే అవకాశం ఉంటే ఏమో కానీ మిడిల్ బెర్త్ వారు కేవలం రాత్రి 10 నుంచి మార్నిన్ 6 వరకు మాత్రమే దాన్ని వేసుకుని పడుకునే ఛాన్స్ ఉంది. డే టైం అంతా లోయర్ బెర్త్ లేదా అప్పర్ బెర్త్ వారితో సీటు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది చాలామందికి తెలియక అవతల వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ రైల్వే (Railway) శాఖ కొత్త రూల్స్ ప్రకారం మిడిల్ బెర్త్ వారు కేవలం రాత్రి పూట మాత్రమే దాన్ని వేసుకుని పడుకునే అవకాశం ఉంది.