Site icon HashtagU Telugu

Slackline Athlete Rope Walk : రెండు ఎత్తయిన టవర్ల మధ్య కట్టిన తాడుపై నడుస్తూ రికార్డు..

Slackline athlete Jaan Roose Walk Between 2 Biggest Towers in Qatar

Slackline athlete Jaan Roose Walk Between 2 Biggest Towers in Qatar

రోప్ వాక్‌(Rope Walk)… తాడు మీద న‌డ‌క చాలా క‌ష్ట‌మైన విన్యాసం. ఏ మాత్రం ప‌ట్టుద‌ప్పినా ప్రాణాల‌కే ప్ర‌మాదం. జీవన యానం కోసం రెండు కర్రల మధ్య తాడుపై నడిచే వారిని సర్కస్ లో చూసి అమ్మో.. ఎలా నడుస్తున్నారు బాబోయ్ అని ఆశ్చర్య పోతాం. మరి ఈ వీడియో చూడండి.. వణుకు పుట్టిస్తుంది.

ఓ వ్యక్తి రెండు టవర్ల మధ్య 185 మీటర్ల ఎత్తులో 2.5 సెంటి మీటర్లు వెడల్పు ఉన్న సన్నని తాడులా ఉండే స్లాక్ లైన్ పై ఎలాంటి ఆధారం లేకుండా నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఎస్టోనియాకు చెందిన స్లాక్ లైన్ అథ్లెట్(Slackline Athlete) జాన్ రూజ్(Jaan Roose) ఈ ఫీట్ చేసాడు.

గత ఆదివారం ఖతార్‌లోని లుసైర్ మెరీనాలో రెండు బిల్డింగుల మధ్య సన్నటి తాడు కట్టి ఈ ఫీట్ చేశాడు. ఈ వీడియోలో వేగంగా వీస్తున్న గాలితో అటూఇటూ వణుకుతూ తాడుపై నడుస్తుండటం చూడొచ్చు. బలమైన గాలుల మధ్య బాలన్స్ సాధించడానికి జాన్ రూజ్ చేసిన ప్రయత్నం, మధ్యలో కావాలనే చేసిన ఫీట్లు ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తున్నాయి. ఈ ఫీట్ కోసం ఆ టవర్ లలో ఉన్న హోటల్స్ కి ఒకరోజు సెలవు ప్రకటించారు.

మూడుసార్లు స్లాక్‌లైన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జాన్ రూస్, భూమి నుండి 185 మీటర్ల ఎత్తులో రెండు టవర్‌ల మధ్య నడుస్తూ 150 మీటర్ల దూరాన్ని నడుస్తూ ప్రపంచంలోనే అతి పొడవైన ఎల్ఈడి స్లాక్ లైట్ రికార్డు సృష్టించాడు. 2021 లో బోస్నియాలో 100 మీటర్ల ఎత్తులోను, 2022లో కజకిస్తాన్ అని రెండు పర్వతాల మధ్య 500 మీటర్ల పొడవులోనూ ఇలాంటి ఫీట్ నిర్వహించాడు.

జాన్ రూజ్ షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. కొందరు అతన్ని సూపర్ హీరో అని పొగుడుతుంటే, మరికొందరు ఇలా ప్రమాదాలతో పోరాడటం అవసరమా అంటున్నారు.

 

Also Read :Domino Tower Falls : కూలిపోవడం ఇంత అందంగా ఉంటుందా.. గిన్నిస్ రికార్ డొమినో టవర్ కూల్చివేత..