ఈ నెల 25వ తేదీన తెల్లవారుజాము సమయంలో ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందని వారు తెలిపారు. ఈ సమయంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే రేఖలో సమీపంలో కనిపించనున్నాయి. ఇది చూస్తే మనకు ఆకాశంలో ఒక స్మైలీ ఫేస్ లా కనిపించనుందని నాసా పేర్కొంది. ముఖ్యంగా ఈ దృశ్యాన్ని ఎలాంటి పరికరాల అవసరం లేకుండా కళ్లతోనే చూడవచ్చు.
Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం
ఈ అద్భుత దృశ్యాన్ని మరింత స్పష్టంగా చూడాలంటే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ వాడితే బాగుంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహాలు మెరిసే ప్రకాశంతో కనిపించడంతో చిన్న పిల్లలు సహా పెద్దలు కూడా ఈ స్మైలీ ఆకారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రశాంతమైన ప్రదేశాలు, వాతావరణం స్వచ్ఛంగా ఉండే ప్రాంతాలు ఉత్తమమని చెబుతున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట్, వరంగల్‌లో పాకాల సరస్సు, భద్రకాళి ఆలయం ప్రాంతాల్లో ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అడవులు, విశాఖపట్నంలో ఆర్కే బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, తిరుపతిలో చంద్రగిరి కోట, కొండ వ్యూ పాయింట్లు అద్భుత దృశ్యానికి ఉత్తమమైన లొకేషన్లు కావున, ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి!