Viral Video : శిష్యుడిని చెప్పుతో కొట్టిన సింగర్.. వివరణ వింటే షాక్ అవుతారు!!

Viral Video : ప్రముఖ పాకిస్తానీ సింగర్ రాహత్ ఫతేహ్‌ అలీ ఖాన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 01:05 PM IST

Viral Video : ప్రముఖ పాకిస్తానీ సింగర్ రాహత్ ఫతేహ్‌ అలీ ఖాన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తన శిష్యుడిని చెప్పుతో కొట్టే సీన్ ఆ వీడియోలో ఉంది. ఇంట్లోని పవిత్ర జలానికి సంబంధించిన ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో తన శిష్యుడిపై రాహత్​ చేయి చేసుకున్నారు. తనను వదిలేయండి అంటూ సింగర్ రాహత్​ను బాధితుడు బతిమిలాడటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సహనం కోల్పోయిన చెప్పుతో కొట్టడం కంటిన్యూ చేసిన అలీ ఖాన్‌ను అక్కడున్న సిబ్బంది నిలువరించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈ వీడియోపై(Viral Video)  సింగర్ రాహత్ ఫతేహ్‌ అలీ ఖాన్‌ వివరణ ఇస్తూ ..‘‘అది గురు, శిష్యుల మధ్య విషయం’’ అని కామెంట్ చేశారు. ‘‘బాధితుడు నా శిష్యుడే. అతడు నా కొడుకులాంటి వాడు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలి. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తాను. తప్పు చేస్తే శిక్షిస్తాను. జరిగిన దానికి నేను బాధితుడికి క్షమాపణలు కూడా చెప్పాను’’ అని ఆయన తెలిపారు.

Also Read :Ration Card E-KYC : రేషన్‌ కార్డుదారుల ఈ-కేవైసీ గడువు పెంపు.. ఎప్పటివరకు ?

ఈ ఘటనపై సింగర్ రాహత్ ఫతేహ్‌ అలీ ఖాన్‌ వివరణ ఇచ్చిన వీడియోలో బాధితుడు కూడా మాట్లాడారు. పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోవడం పట్ల రాహత్​ తనపై ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిపారు. దానికి తానే కారణమని, అందుకే ఫతేహ్‌ అలీ ఖాన్‌ అలా దండించారని తెలిపారు. అంతకుమించి ఆయన చేసినదాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని బాధితుడు అన్నాడు. అలీ ఖాన్‌ తనకు తండ్రిలాంటి వారని, ఆయన తమను చాలా ప్రేమిస్తారని అన్నారు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ చేశారని బాధితుడు చెప్పుకొచ్చాడు.

Also Read : Silver Broom : అయోధ్య రామమందిరానికి 1.751 కేజీల వెండితో చీపురు

220 మంది చిన్నారులు..

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిమోనియా కారణంగా దాదాపు 220 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ మార్పులే. తీవ్రమైన చలి కారణంగా 2024 జనవరి 1 నాటికి 10,250 నిమోనియా బారిన పడి చనిపోయారు. వీరంతా ఐదేళ్లలోపు చిన్నారులు కావడం గమనార్హం. కేవలం మూడువారాల వ్యవధిలోనే 220 మంది చిన్నారులు మరణించడం గమనార్హం.

Follow us