Site icon HashtagU Telugu

Earphones Effect: షాకింగ్.. ఇయర్ ఫోన్స్ వాడకంతో వినికిడి కోల్పోయిన బాలుడు!

Earphones

Earphones

మీరు అదే పనిగా ఇయర్ ఫోన్స్ (Earphones) పెట్టుకొని పాటలు వింటున్నారా? అయితే జర జాగ్రత్త. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల బాలుడు ఇయర్ ఫోన్ వాడటం వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఫలితంగా అతనికి చెవులు వినిపించడం లేదు. ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు (Long Time) ఉపయోగించడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ కారణంగా బాలుడు వినికిడి శక్తిని కోల్పోయాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో బ్యాక్టీరియా లేదా వైరస్‌లు వృద్ధి చెందడానికి కారణమవుతాయి.

మన శరీరం మాదిరిగానే చెవులకు కూడా వెంటిలేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఎక్కువసేపు మూసి ఉంచడం వల్ల చెమట పెరిగి, తర్వాత ఇన్ఫెక్షన్ (Virus) వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. టెక్నాలజీ యుగంలో ఇయర్‌ఫోన్‌లు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. ప్రత్యేకించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించాల్సి వస్తే చాలామంది ఎక్కువ గంటలు వాడాల్సి ఉంటుంది. అయితే ఇయర్ ఫోన్స్ నిరంతరం గంటల తరబడి ఉపయోగించడం వల్ల చెవులను దెబ్బతీసేంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Also Read: Sunny Leone: మాల్దీవ్స్ లో అందాల ఆరబోస్తూ.. సమ్మర్ లో సెగలు రేపుతూ!