Site icon HashtagU Telugu

Brazilian Teacher: విద్యార్థులతో టీచరమ్మా సెక్సీ డాన్సులు.. చక్కర్లు కొడుతున్న వీడియోలు!

Teacher Dance

Teacher Dance

‘విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ మన పెద్దలు తరచుగా చెప్పే మాటలు. ఈ మాటలను నిజం చేస్తూ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ బెస్ట్ టీచర్స్ అని నిరూపించుకుంటున్నారు. విద్యార్థులకు పాఠాలు భోదించడంతో పాటు జీవిత నైపుణ్యాలు నేర్పిస్తుంటారు. కానీ అలాంటి టీచర్లు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. తమ శిష్యులైన విద్యార్థులతోనే ప్రేమ కలాపాలు కొనసాగిస్తన్నారు. కాదంటే లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అమెరికాలో లేడీ టీచర్స్ టీనేజ్ విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్న విషయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనలో టీచర్లు సస్పెండ్ అయినప్పటికీ ఘటన పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ మండిపడుతున్నారు. తమ పిల్లలను స్కూల్ కు ఎలా పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ బ్రెజిల్ టీచర్ (Teacher) విద్యార్థులతో సెక్సీ డాన్సులు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఒక బ్రెజిలియన్ టీచర్ తన విద్యార్థులతో “సెక్సీ” డ్యాన్స్ వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసినందుకు ఉద్యోగం నుండి తొలగించబడింది. బ్రెజిల్‌లోని ఓ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే సిబెల్లీ ఫెరీరాకు టిక్‌టాక్‌లో 9.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ (Followers) ఉన్నారు.

విద్యార్థులతో వెరైటీగా పాఠాలు చెప్పాలనో, లేక తన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవాలనేమో కానీ.. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించింది. ఫెరీరా క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతున్న సమయంలో అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి డ్యాన్స్ (Dance) చేసింది. క్లాస్ రూమ్ లోనే విద్యార్థుల చేతులను పట్టుకొని ఒంటి మీద చేయ్యి సెక్సీ డాన్సులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంగ్లీష్ టీచర్ తన స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు పొట్టి బట్టలు వేసుకొని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అంతేకాదు.. ప్రతి స్త్రీ కూడా తన శరీరంతో స్వేచ్ఛగా మరియు సంతృప్తి చెందాలి” అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం టీచరమ్మ సెక్సీలు వీడియోలు వైరల్ (Viral video) కావడంతో మేనేజ్ మెంట్ ఆమెను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Sharwanand Marriage: రూమర్స్ కు చెక్.. జూన్3న శర్వానంద్, రక్షిత పెళ్లి!

Exit mobile version