హైదరాబాద్ ఎంఎంటీఎస్ (MMTS) రైలులో జరిగిన అనుమానాస్పద ఘటనలో విచారణ కొత్త మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం ఓ యువతి రైలు నుంచి కింద పడిపోవడంతో, ఆమెపై అత్యాచారయత్నం (Rape Attempt)జరిగిందన్న వార్తలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. అప్పట్లో యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టారు.
Maoists : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
అయితే తాజాగా వచ్చిన వివరాల ప్రకారం.. అసలు యువతిపై ఎలాంటి అత్యాచారయత్నం జరగలేదని వెల్లడైంది. నిజానికి రైలులో ప్రయాణిస్తూనే యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని దర్యాప్తులో తేలింది. కానీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకుంటే నేరుగా తిట్టించుకుంటాననే భయంతో, ఓ యువకుడు తనను అత్యాచారం చేయబోతున్నాడని తప్పుడు కథ చెప్పింది. ఈమె పిర్యాదు మేరకు పోలీసులు సైతం అలర్ట్ అయ్యి విచారణ చేపట్టారు. కానీ ఎక్కడ కూడా నిందితుడి ఆచూకీ లభించకపోవడం తో సదరు యువతిని గట్టిగా అడగడంతో అసలు నిజం చెప్పింది. ఆమె చెప్పిన అబద్ధం వలన ఒక నిర్దోషి యువకుడిపై అనవసరంగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో సమీక్షిస్తూ, తప్పుడు ఫిర్యాదు చేసిన యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే దిశగా ఆలోచిస్తున్నారు.