Selfie With Snake: మెడలో పాముతో సెల్ఫీ.. కాటు వేయడంతో చివరకు!?

జనాలకు ఈ మధ్యన ఫోటోలు మరియు సెల్ఫీల మోజు చాలా ఎక్కువైంది. సెల్పీలు, ఫోటోలు, వీడియోలు అంటూ అందరూ తమ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 01 25 At 21.19.57

Whatsapp Image 2023 01 25 At 21.19.57

Selfie With Snake: జనాలకు ఈ మధ్యన ఫోటోలు మరియు సెల్ఫీల మోజు చాలా ఎక్కువైంది. సెల్పీలు, ఫోటోలు, వీడియోలు అంటూ అందరూ తమ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు. అయితే సెల్ఫీల పిచ్చి వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా ఏపీలో ఇలాంటి ఓ సెల్ఫీ పిచ్చి వ్యక్తి ప్రాణాలు తీసింది.

ఫోటోలు, సెల్ఫీలు అంటే ఇష్టపడే ఓ వ్యక్తి.. పాములు ఆడించే వ్యక్తి దగ్గరి నుండి పామును మెడలో వేసుకొని, సెల్ఫీ దిగాడు. మెడలోని పామును కిందికి దించుతున్న టైంలో ఒక్కసారి పాము అతడిని కాటు వేసింది. దాంతో అతడిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించే క్రమంలో, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అందరికి బాధ కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తాళ్లూరుకు చెందిన మణికంఠ రెడ్డి కందుకూరులో జీవనం గడుపుతున్నాడు. కందుకూరులో జ్యూస్ సెంటర్ నడుపుతున్న మణికంఠ రెడ్డి.. అక్కడి ఆర్టీసీడిపో సమీపంలోకి మంగళవారం రాత్రి పాములు ఆడించే వ్యక్తిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి, అతడి వద్ద ఉన్న పాములను ఆసక్తిగా గమనించాడు.

ఆ పాములను చూసి మణికంఠ రెడ్డికి ఓ ఆలోచన వచ్చింది. పామును మెడలో వేసుకొని ఓ సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఇంకేముంది అక్కడ ఉన్న ఓ పామును మెడలో వేసుకొని సెల్పీ దిగాడు. మెడలో ఉన్న పామును కిందికి దించుతున్న టైంలోనే అనుకోని ఘటన జరిగింది. అతడి మెడలోని పాము వెంటనే కాటువేసింది. దీంతో చికిత్సకై మణికంఠ రెడ్డిని ఒంగోలు రిమ్స్ కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

  Last Updated: 26 Jan 2023, 06:52 AM IST