Site icon HashtagU Telugu

Germany: బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. ఏం చేశారు తెలుసా?

Germany

Germany

మామూలుగా సముద్ర తీర ప్రాంతాలలో, సముద్రం లోపల, పాతబడిన శిథిలా వ్యవస్థలలో కొన్ని కొన్ని సార్లు పాత వస్తువులు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యుద్ధాలలో ఉపయోగించిన తుపాకీలు, కత్తులు, యుద్ధ సామాగ్రి, బాంబులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే గతంలో చాలాసార్లు ఇలాంటి వస్తువులు బయట పడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా రెండవ ప్రపంచం యుద్ధం నాటి బాంబు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం రేపింది.

ఈ బాంబు ఒక టన్ను బరువు ఉంటుంది. సిటీలోని జూ సమీపంలో ఈ బాంబును గుర్తించారు. ఈ క్రమంలో బాంబు ఉన్న ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరినీ అధికారులు అక్కడి నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. మరోవైపు ఈ బాంబును డిస్పోజ్ చేసే ఆపరేషన్ ను పోలీసులు, బాంబ్ స్క్వాడ్ చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 1940 – 1945 మధ్య కాలంలో బ్రిటీష్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ లు యూరప్ పై 2.7 టన్నుల బాంబులను జారవిడిచాయి. వీటిలో సగం బాంబులను జర్మనీపై వేశారు.

1945 మేలో జర్మనీలోని నాజీ ప్రభుత్వం సరెండర్ అయ్యే సమయానికి ఆ దేశంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మొత్తం నాశనమయ్యాయి. డజన్ల కొద్దీ నగరాలు బూడిదగా మారిపోయాయి. హిట్లర్ 1945 ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరోవైపు, 2021 డిసెంబర్ లో మ్యూనిక్ స్టేషన్ సమీపంలోని ఒక కన్స్ స్ట్రక్షన్ సైట్ వద్ద రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. 2017లో ఫ్రాంక్ ఫర్ట్ లో 1.4 టన్నుల బరువైన బాంబును కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం నుంచి 65 వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అయితే ప్రస్తుతం ఆ బాంబుని డిస్పోజ్ చేసే పనిలో ఉన్నారు పోలీస్ బృందం.

Exit mobile version