Site icon HashtagU Telugu

Students Cleaning Toilet: విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు

Students Cleaning Toilet

Students Cleaning Toilet

Students Cleaning Toilet: విద్యార్థులతో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. ఉన్నత చదువులు చదవాల్సిన విద్యార్థులను హెల్పర్స్ గా మారుస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించారు. కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూనిఫాం ధరించిన విద్యార్థులు బ్రష్‌లతో బాత్‌రూమ్‌లను శుభ్రం చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక ఇచ్చారు. గత వారం జరిగిన ఈ షాకింగ్ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరణ ఇస్తూ.. టాయిలెట్‌ను సక్రమంగా ఫ్లష్ చేయమని మాత్రమే విద్యార్థులకు చెప్పానని, శుభ్రం చేయమని చెప్పలేదన్నారు. విద్యార్థులు బాత్‌రూమ్‌లు కడగడం వంటి ఘటనలు కర్ణాటకలో వెలుగులోకి రావడం ఇది మూడోసారి.

గత వారం, రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మరుగుదొడ్లను శుభ్రం చేయడం కనిపించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, రాజకీయ నేతలు నగరంలోని ఆంధ్రహళ్లిలోని పాఠశాల ఎదుట బైఠాయించారు. అనంతంరం విద్యాశాఖ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు మరుగుదొడ్లు శుభ్రం చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Also Read: AP DGP: ఏపీలో తగ్గిన నేరాలు: ఏపీ డీజీపీ