SBI : ఆర్టీఐ చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ నిరాకరణ

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 03:28 PM IST

SBI: ఎన్నిక‌ల సంఘాని(Election Commission)కి స‌మ‌ర్పించిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల(Electoral bonds) అంశాల‌ను ఆర్టీఐ చ‌ట్టం(RTI Act) ప్ర‌కారం వెల్ల‌డించ‌బోమ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పేర్కొన్న‌ది. వ్య‌క్తిగ‌త స‌మాచారం విశ్వ‌స‌నీయ‌మైద‌ని ఎస్బీఐ తెలిపింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాలు ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్నా వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వెల్ల‌డించ‌లేమ‌న్న‌ది. సుప్రీం ఆదేశాల‌తో ఈసీకి స‌మ‌ర్పించిన వివ‌రాల‌కు చెందిన డిజిట‌ల్ డేటాను ఇవ్వాల‌ని ఆర్టీఐ కార్య‌క‌ర్త లోకేశ్ బ‌త్రా దార‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ అభ్య‌ర్థ‌న‌ను బ్యాంక్ తిర‌స్కరించింది. ఆర్టీఐ చ‌ట్టంలోని సెక్ష‌న్‌8(1)(ఈ), సెక్ష‌న్ 8(1)(జే) ప్ర‌కారం విశ్వ‌స‌నీయ‌, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని బ‌హిర్గ‌తం చేయ‌బోమ‌ని బ్యాంకు తెలిపింది. ఎల‌క్టోర‌ల్ బాండ్లు కొన్న‌వారి, రాజ‌కీయ పార్టీల స‌మాచారాన్ని వెల్ల‌డించ‌డం ఆ చ‌ట్టాల ప్ర‌కారం నేరం అవుతుంద‌ని ఎస్బీఐ పేర్కొన్న‌ది. సుప్రీంకోర్టులో త‌మ కేసును వాదించేందుకు సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీశ్ సాల్వేకు ఎంత ఫీజులు చెల్లించారో చెప్పాల‌ని కూడా బ‌త్రా కోరారు. ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని షేర్ చేసేందుకు ఎస్బీఐ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని బ‌త్రా తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

Read Also: Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్‌కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం