Saudi Arabia: బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఇక ఫైన్ కట్టాల్సిందే

భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరు, ఎలాగైనా బ్రతికేయొచ్చు. చట్టానికి లోబడి బ్రతకడం ఏ దేశంలో అయినా సాధారణమే.

Saudi Arabia: భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరు, ఎలాగైనా బ్రతికేయొచ్చు. చట్టానికి లోబడి బ్రతకడం ఏ దేశంలో అయినా సాధారణమే. కానీ కొన్ని దేశాల్లో ఆ చట్టాలు ప్రజల హక్కులను కూడా కాలరాస్తాయి. నిజానికి మన దేశంలో బట్టలు ఆరేసేది ఎక్కడ అంటే బాల్కనీలో అని చెప్తారు. ఒకవేళ అక్కడ ఆరబెడితే మీకు జరిమానా విధిస్తాం అంటే ఊరుకుంటారా?. మరుసటి రోజే ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలతో మారుమ్రోగిస్తారు. కానీ సౌదీలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేగా. అక్కడ రూల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు.

బాల్కనీలను దుర్వినియోగం చేస్తే, భవన యజమానికి 200 రియాల్స్ మరియు 1000 రియాల్స్ మధ్య జరిమానా విధించబడుతుందని సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాంగణం వెలుపల గొడుగులు లేదా హ్యాంగర్లు ఉండకూడదు. మీరు మీ బట్టలు బాల్కనీలో ఆరబెట్టినా జరిమానా విధించబడుతుంది. వీటన్నింటికీ మంత్రిత్వ శాఖ 200 రియాల్స్ నుండి 10,000 రియాల్స్ వరకు జరిమానా విధించింది.. బాల్కనీలు శుభ్రంగా ఉంచుకోవాలి. భవనం పైభాగంలో దాచి ఉంచినప్పటికీ, భవనం ఎత్తు నిర్దేశించిన ఎత్తుకు మించకూడదు. భవనం ముందు భాగం ప్రధాన రహదారి వైపు ఉంటే, కొంత వదిలేసి కట్టుకోవాలి. భవనం ముఖభాగంలో పగుళ్లు ఉండకూడదు. ఎలక్ట్రిక్ కేబుల్స్ భవనం ముఖభాగంపై వేలాడదీయకూడదు. భవనం ముందు భాగంలో స్టిక్కర్లు వేయడం కూడా చట్టవిరుద్ధమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: TSRTC: రాఖీ పౌర్ణమికి టి-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత