Site icon HashtagU Telugu

2024 Sankranti : సంక్రాంతి పండగ వేళ ఓ ‘కీడు’ ప్రచారం వైరల్ గా మారింది..

Sankranti Fake News Viral

Sankranti Fake News Viral

అభివృద్ధిలో దేశం ఎంతగా దూసుకెళ్తుందో చెప్పాల్సిన పనిలేదు..మన శాస్త్రవేత్తలు సైతం చంద్రుడి ఫై కాలు మోపేలా చేసి రికార్డు సృష్టించారు. ప్రతి రోజు ఎన్ని టెక్నలాజిలు పుట్టుకొస్తూ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి..ఆడవారు సైతం మగవారికి ఏమాత్రం తీసిపోని రీతిలో రాణిస్తున్నారు..ఇంతలా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంటే..మూఢనమ్మకాలు మాత్రం ప్రజల నుండి దూరం కావడం లేదు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా మూఢనమ్మకాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత చదువుకున్న..ఎంత పెద్ద జాబ్ చేస్తున్న ఎక్కడో ఓ చోట మాత్రం మూఢ నమ్మకాన్ని నమ్మెతిరుతున్నారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఓ మూఢనమ్మకం వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

మరో నాల్గు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలుకాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంత బాగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సంక్రాంతి వస్తుందంటే చాలు.. దేశ నలుమూలాలనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న సరే వారంతా తమ సొంతళ్లుకు వచ్చి పండగను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండగ ఇక ఇప్పుడు కీడు పండగైందని చెప్పి ఓ పుకారు లేపారు. ప్రస్తుతం ఈ పుకారు..పల్లెలు దాటి పట్టణాలకు చేరింది.

ఇంతకీ ఆ కీడు ఏంటి అంటే…

‘ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలి. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలి. ఇది సంక్రాంతి పండగ లోపు పూర్తి చేయాలి. లేకుంటే కీడు తప్పదు’ అంటూ ఓ ప్రచారం సోషల్ మీడియా లో విస్తృతంగా షేర్ అవుతుంది. ఫోన్లో నుండి వీధుల్లోకి..వీధుల్లో నుండి ఇప్పుడు పట్టణాల వరకు చేరింది. నలుగురు ఆడవారు ఓ చోట కలిస్తే దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడమే కాదు డబ్బులు అడుగుతూ గాజులు కొనుగోలు చేయడం చేస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ వార్తలను కొంతమంది ఖండిస్తూ..గతంలో ఇలాగే వదిన మరదళ్ళు గాజులు, అన్నదమ్ముల్లకు కుడుకలు, ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు, వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారని..అవన్నీ ఒట్టి పుకార్లే అని చెపుతున్నారు. కానీ అబద్దానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎవ్వరు వీరి మాటలు పట్టించుకోకుండా గాజులు కొనే పనిలో ఉన్నారు.

Read Also :

Exit mobile version