ఇటీవల కామాంధులు రెచ్చిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం…ఒంటరి మహిళా అనే కాదు..అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదిలిపెట్ట కుండా కొంతమంది కామ మృగాలు తమ కామ కోరికను తీర్చుకుంటున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ కామ పిశాచుల వల్ల ఆడపిల్లల తల్లిదండ్రులు ఒంటరిగా తమ పిల్లలను బయటకు పంపించాలన్నా..ఇంట్లో ఉంచాలన్న భయపడుతున్నారు. ప్రభుత్వాలు , పోలీసులు , కోర్ట్ లు , సమాజం ఇలా అంత ఎన్ని శిక్షలు విధించిన కామాంధుల్లో మార్పు , భయం అనేది రావడం లేదు. ఇప్పటివరకు బ్రతికున్న వారిపైనే ఇలాంటి అఘాత్యాలు చేస్తున్నారని భావించాం..కానీ ఇక్కడ ఓ కామాందుడు చనిపోయిన మహిళల మృతదేహాలను కూడా వదిలిపెట్టకుండా తన కామ కోరికను తీర్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన యూకే(UK)లో చోటుచేసుకుంది. డేవిడ్ ఫుల్లర్ అనే వ్యక్తి హాస్పిటల్ మార్చురీ (Hospital Mortuary)లో పనిచేస్తూ 13 ఏళ్ల కాలంలో 101 మంది మహిళా మృతదేహాలపై (female corpses) లైంగిక దాడులు చేసినట్లు నిర్ధారణ అయింది. అందులో పసి బాలిక మొదలు వృద్ధురాళ్ల వరకూ ఉన్నారు. మృతదేహాలతో కామవాంఛలు తీర్చుకుని వాటిని వీడియో రూపంలో భద్రపరుచుకున్నాడు. అతని హార్డ్ డిస్క్‌లో కొన్ని వేల పోర్న్ వీడియోలు, అతడు శవాలతో చేసిన శృంగార వీడియోలు బయటపడ్డాయి. 2021లో అతడికి కోర్టు రెండు జీవిత ఖైదు శిక్షలను విధించింది.
Read Also : Delhi Richest People: ఢిల్లీలో ధనవంతులు నివసించేది ఈ 5 ప్రదేశాల్లోనే!