Site icon HashtagU Telugu

Ambulance : అంబులెన్స్‌కు దారివ్వ లేదని రూ.2.5 లక్షల ఫైన్..లైసెన్స్‌ రద్దు

The Kerala Police Took Stri

The Kerala Police Took Stri

మనిషి ప్రాణం అనేది ఎంత ముఖ్యమో తెలియంది కాదు..మానవ సృష్టిలో మనిషిగా పుట్టడం అనేది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఉన్నన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాణం పోతే మళ్లీ రాదు..అందుకే ప్రతి మనిషి ప్రాణం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి ప్రాణాన్ని కాపాడడంలో అంబులెన్స్‌ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే సైరన్ వేసుకొని ఘటన స్థలానికి చేరుకొని సగటు వ్యక్తి ప్రాణాలను కాపాడుతుంటుంది. వీలైనంత త్వరగా అతడ్ని హాస్పటల్ లో చేర్చేందుకు ట్రై చేస్తుంది. అందుకే అంబులెన్స్‌కు దారి ఇవ్వండి ..ప్రాణాలు కాపాడండి అంటూ ప్రతి ఒక్కరూ చెపుతుంటారు. అంబులెన్స్‌ వస్తుంటే దేశ పీఎం అయినాసరే పక్కకు జరగాల్సిందే. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అంబులెన్స్‌కు దారిఇవ్వకుండా అలాగే తన కారును నడుపుతూ ముందుకు వెళ్ళాడు. దీంతో అతడికి భారీ షాక్ ఇచ్చారు పోలీసులు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్‌ (Thrissur)లో చోటుచేసుకుంది.

నవంబర్ 07 న ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపై అంబులెన్స్‌ వెళ్తుంటే అన్ని వాహనాలూ పక్కకు వెళ్లాయి. అయితే, ఓ కారు మాత్రం అంబులెన్స్‌ ఎంతగా హారన్‌ కొడుతున్నా, కుయ్‌ కుయ్‌ అంటూ సౌండ్‌ చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ అంబులెన్స్‌ ఆ కారు వెనకాలే వెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరి సదరు కారు నడుపుతున్న వ్యక్తిని తిట్టినా తిట్లు తిట్టకుండా తిట్టారు. ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగి..వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించారు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. అంబులెన్స్‌కు దారి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.2.5 లక్షల భారీ జరిమానా తో పాటు అతడి లైసెన్స్‌ కూడా రద్దు చేశారు. ఇలా చేస్తేనే మరోసారి ఇలాంటి తప్పులు మరొకరు చేయరని అంత అంటున్నారు.

Read Also : Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..