World Expensive Medicine: వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్‌కి జైపూర్‌లోని జేకే లోన్ హాస్పిటల్‌లో రూ. 17.5 కోట్ల విలువైన ఇంజక్షన్ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఇంజక్షన్ గా చెప్తున్నారు. ఆ ఇంజక్షన్ ద్వారా అర్జున్ ఇప్పుడు అందరు పిల్లలలాగే ఉంటాడని చెప్తున్నారు వైద్యులు.
జైపూర్‌లోని జేకే లోన్ హాస్పిటల్ వైద్యుడు మాథుర్ మాట్లాడుతూ అర్జున్‌కి జోల్‌గనెస్మా (Zolganesma) ఇంజెక్షన్ ఇచ్చామని చెప్పారు. అయితే ఖరీదైన ఇంజక్షన్ కి కావాల్సిన సొమ్మును క్రౌడ్ ఫండింగ్(Crowdfunding) ద్వారా సేకరించారు. సాధారణ ప్రజలు మరియు ఎన్‌జిఓలు కూడా అర్జున్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ ఇంజెక్షన్ ధర దాదాపు రూ.16 కోట్లు అయితే ఇంజెక్షన్‌ను అందిస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీ దాని ధరను సగానికి తగ్గించింది. దీని తర్వాత ఈ ఇంజెక్షన్‌ను సుమారు రూ. 8.5 కోట్లకు అర్జున్ చికిత్స కోసం అందుబాటులో ఉంచారు. దీనికి ముందు హృదయాంశ్ విషయంలో కూడా ఈ కంపెనీ ఈ ఇంజెక్షన్ ధరను సగానికి తగ్గించింది.
పిల్లల వెన్నెముక కండరాల క్షీణత అనేది జన్యుపరమైన వ్యాధి. ఇందులో వెన్నుపాము, నరాలు ప్రభావితమవుతాయి. ఈ వ్యాధికి జోల్‌గనెస్మా ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేస్తారు. ఈ ఇంజక్షన్ ఖరీదు కోట్ల రూపాయలు ఉంటుంది. అర్జున్‌కి ఇంజక్షన్ వేశారు. వచ్చే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. కండరాల క్షీణత ద్వారా వ్యక్తి నడుము క్రింద భాగం అస్సలు పనిచేయదు. కాలక్రమేణా శరీరంలో అనేక రకాల మార్పులు మొదలవుతాయి. ఈ వ్యాధి కారణంగా మరణించే ప్రమాదం కూడా ఉంది.
Also Read: Simran Budharup : ఫేమస్ వినాయక మండపంలో నటిపై దాడి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి..