Site icon HashtagU Telugu

Viral : కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..

ఇటీవల దొంగలు స్టయిల్ మార్చారు..సినిమాల ప్రభావమో..లేక కొత్తగా ట్రై చేయాలనో..కానీ దొంగతనాలను ఇలా కూడా చేయొచ్చు అన్నమాట అనే విధంగా చేస్తున్నారు. తాజాగా కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ చేసి ఏమన్నా దొంగలా అని అందరి చేత అనిపించుకుంటున్నారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన ఆగ్రా-ముంబై రహదారిపై జరిగింది. దుస్తుల లోడ్‌తో వెళ్తోన్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కి.. దుస్తులతో ప్యాక్ చేసిన ఓ పెద్ద బ్యాగును రోడ్డుపై పడేశారు. ఆ లారీ వెనకాలే ఫాలో అయిన మరో దొంగ బైకుతో సిద్ధంగా ఉండి.. బ్యాగు పడేసిన తర్వాత వెనకాలే వెళ్లిన మరో దొంగ వారిద్ధరిని చాకచక్యంగా బైక్‌ పైకి ఎక్కించుకున్నాడు. ఇదంతా కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగింది. అదే రహదారిపై వెళ్తోన్న మరో వాహనదారుడు వీడియో తీయటంతో..వీరి దొంగతనం బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దొంగతనాలల్లో ఈ దొంగతనం వేరయ్యా అని అంత కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Europe Tour: 4-2తో బెల్జియంను ఓడించిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టు