రిలయన్స్ జియో (JIO ) తన యూజర్లకు తాజా హెచ్చరిక (Warning ) జారీ చేసింది. “ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్” (Premium Rate Service Scam) పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ISD నంబర్లతో (International numbers) వస్తున్న మిస్డ్ కాల్స్ (missed calls) గురించి జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు ఈమెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ స్కాములో భాగంగా, ఇంటర్నేషనల్ నంబర్లకు కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200 నుంచి రూ.300 వరకు ఛార్జ్ అవుతుంది.
Amaravathi : అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు
జియో తెలిపిన ప్రకారం.. ఈ మోసాలు ఎక్కువగా +91 మినహా ఇతర ప్రిఫిక్స్‌లతో ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా జరుగుతున్నాయి. ఆత్రుతతో మిస్డ్ కాల్ తిరిగి డయల్ చేస్తే కస్టమర్లకు భారీ చార్జీలు పడుతున్నాయి. ఈ తరహా మోసాల వల్ల కస్టమర్లకు భారీగా నష్టం వాటిల్లుతోందని కంపెనీ తెలిపింది. స్కామర్లు ఇలా ప్రజలను మోసగించడానికి ప్రీమియం రేటెడ్ నంబర్లను ఉపయోగిస్తున్నారు. ఈ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా, యూజర్లు అవగాహన లేకుండా ఎక్కువ ఛార్జ్‌లు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను నివారించేందుకు, ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ సదుపాయాన్ని ఆన్ చేసుకోవాలని జియో సూచించింది. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని టెలికం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా స్కామ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో, యూజర్లు జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరమని వారు సూచిస్తున్నారు.