Rat Bathing : అరె.. ఎలుక భలే స్నానం చేస్తుందే వర్షంలో..

మామూలుగా ఎలుకలు కలుగులో ఉంటాయి. అవి డ్రైనేజీల్లో కూడా చాలా హ్యాపీగా తిరిగేస్తాయి. కానీ వర్షం చూసి ఈ ఎలకకి మంచి మూడ్ వచ్చింది. శుచి, శుభ్రత గుర్తొచ్చి పడుతున్న వర్షాన్ని షవర్ లా ఫీల్ అయ్యి స్నానం మొదలెట్టింది.

Published By: HashtagU Telugu Desk
Rat Bathing in Rain cute video goes viral

Rat Bathing in Rain cute video goes viral

నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఇప్పుడిప్పుడే రుతుపవనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. పిల్ల, పెద్ద అందరూ వర్షాన్ని(Rain) ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా చాలా కామన్. కానీ ఇదిగో ఇక్కడ ఒక ఎలుక(Rat) కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన అన్నట్టు వర్షంలో హాయిగా స్నానం చేస్తోంది. పైనుంచి చినుకులు వస్తూ ఉంటే హ్యాపీగా రెండు చేతులు అంటే అదే రెండు ముందు కాళ్లతో తలని తడుపుకుని మరీ స్నానం(Bathing) చేస్తోంది.

మామూలుగా ఎలుకలు కలుగులో ఉంటాయి. అవి డ్రైనేజీల్లో కూడా చాలా హ్యాపీగా తిరిగేస్తాయి. కానీ ఈ వర్షం చూసి ఈ ఎలకకి మంచి మూడ్ వచ్చింది. శుచి, శుభ్రత గుర్తొచ్చి పడుతున్న వర్షాన్ని షవర్ లా ఫీల్ అయ్యి స్నానం మొదలెట్టింది. వాన పాటకు డాన్స్ వేసినట్టు, ఒక మనిషి ఎలా అయితే సబ్బుతో తల రుద్దుకొని స్నానం చేస్తాడు అలా స్నానం చేసినట్టు, హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ముఖం మీద పడుతున్న వర్షాన్నిటిని తోసుకుంటూ మొహం కడుక్కున్న తీరు చూస్తే తెగ ముద్దొచ్చేస్తుంది.

ఈ వీడియో చూస్తే ఇది మనిషేనేమో అనిపిస్తుంది కానీ అది ఎలుకే. ఇప్పుడు ఈ ఎలక వాన నీటిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా కూడా ఎలుక ఇలా చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వీడియోని రెండోసారి చూడకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. సబ్బు ఉంటే ఇంకా బాగుండేది అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Viral Video: కొంగను పట్టుకొని ఎందుకు ప్రయత్నించిన అలిగేటర్.. కానీ అంతలోనే?

  Last Updated: 08 Jul 2023, 09:32 PM IST